బీఆర్ఎస్ నేత క్రిశాంక్‌కు 14 రోజుల రిమాండ్

నవతెలంగాణ – హైదరాబాద్
బీఆర్ఎస్ నేత, ఆ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్‌కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఉస్మానియా యూనివర్సిటీ మెస్‌ల మూసివేత, సెలవులపై దుష్ప్రచారం చేసిన కేసులో క్రిశాంక్‌తోపాటు, ఓయూ విద్యార్థి నాయకుడు నాగేందర్‌ను పోలీసులు నిన్న అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరూ వర్సిటీ ప్రతిష్ఠకు భంగం కలిగేలా దుష్ప్రచారం చేశారన్న ఓయూ అధికారుల ఫిర్యాదుపై వివిధ సెక్షన్ల కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిన్న హైదరాబాద్ నుంచి కొత్తగూడెం వెళ్తున్న వీరిద్దరినీ పంతంగి టోల్‌గేట్ వద్ద అరెస్ట్ చేశారు. ఈ కేసులో క్రిశాంక్‌కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో ఆయనను చంచల్‌గూడ జైలుకు తరలించారు. కాగా, క్రిశాంక్‌పై గతంలో 14 కేసులు ఉన్నట్టు పోలీసులు తెలిపారు.

Spread the love