వివక్ష ఆరోపణలతో పిఎస్‌జి మేనేజర్‌ అరెస్టు

పారిస్‌ : పారిస్‌ సెయింట్‌ జెర్మెన్‌ (పిఎస్‌జి) మేనేజర్‌ క్రిస్టోఫర్‌ గాల్టియర్‌నుశుక్రవారం పారిస్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. క్రిస్టోఫర్‌ గాల్టియర్‌తో పాటు ఆయన కుమారుడు జాన్‌ వాలోవిక్‌ గాల్టియర్‌ను సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సీజన్‌తో పిఎస్‌జితో క్రిస్టోఫర్‌ కాంట్రాక్టు ముగియనుండగా.. గతంలో ఒలింపిక్‌ జిమ్నాస్టిక్‌ క్లబ్‌ (ఓజీసీ) నైస్‌కు క్రిస్టోఫర్‌ ఫుట్‌బాల్‌ బాస్‌గా వ్యవహరించారు. ఓజీసీ నైస్‌లో పని చేస్తున్న సమయంలో నల్ల జాతీయులు, మస్లింల పట్ల క్రిస్టోఫర్‌ గాల్టియర్‌ వివక్ష చూపించారని ప్రాథమిక విచారణలో తేలింది. క్రిస్టోఫర్‌ గాల్టియర్‌కు సంబంధించిన ఓ ఈమెయిల్‌ పోలీసుల విచారణలో కీలకంగా మారింది. 56 ఏండ్ల క్రిస్టోఫర్‌ గాల్టియర్‌ తనపై వచ్చిన వివక్ష ఆరోపణలను తోసిపుచ్చారు. తప్పుడు ఆరోపణలు చేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటానని, విచారణలో బాధ్యతాయుతంగా నడుచుకుంటానని వెల్లడించాడు.

Spread the love