ప్రపంచకప్‌కు నెదర్లాండ్స్‌

– పదో జట్టుగా అర్హత సాధించిన డచ్‌ జట్టు
న్యూఢిల్లీ : ఐసీసీ వన్డే వరల్డ్‌కప్‌కు నెదర్లాండ్స్‌ అర్హత సాధించింది. ఐసీసీ వరల్డ్‌కప్‌ క్వాలిఫయర్‌ మ్యాచ్‌లో స్కాట్లాండ్‌పై నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందిన నెదర్లాండ్స్‌.. 2023 వరల్డ్‌కప్‌కు టికెట్‌ బుక్‌ చేసుకుంది. చివరగా 2011 వన్డే వరల్డ్‌కప్‌లో కనిపించిన డచ్‌ జట్టు.. 1996, 2003, 2007 ప్రపంచకప్‌లలో సైతం మెరిసింది. రెండు సార్లు చాంపియన్‌ వెస్టిండీస్‌ ప్రపంచకప్‌ పోటీకి దూరం కాగా.. అర్హత టోర్నీలో ఆకట్టుకున్న శ్రీలంక, నెదర్లాండ్స్‌లు చివరి రెండు బెర్త్‌లు దక్కించుకున్నాయి. స్కాట్లాండ్‌ నిర్దేశించిన 278 పరుగుల లక్ష్యాన్ని 43 ఓవర్లలోనే ఊదేసిన నెదర్లాండ్స్‌.. మెగా ఈవెంట్‌కు సిద్ధమవుతోంది.

Spread the love