హెచ్‌ఏఐ జనరల్‌ సెక్రటరీగా జగన్‌ మోహన్‌రావు

జాతీయ హ్యాండ్‌బాల్‌ సంఘంలో కీలక బాధ్యతలు
నవతెలంగాణ-హైదరాబాద్‌ : తెలంగాణ స్పోర్ట్స్‌ అడ్మినిస్ట్రేటర్‌ అర్శినపల్లి జగన్‌మోహన్‌ రావు భారత హ్యాండ్‌బాల్‌ సంఘం (హెచ్‌ఏఐ) ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. జాతీయ హ్యాండ్‌బాల్‌ సమాఖ్య హౌదాపై ఏడాదికిగా కొనసాగుతున్న ప్రతిష్ఠంభనకు తెరదించిన జగన్‌మోహన్‌ రావు.. భారత ఒలింపిక్‌ సంఘం (ఐఓఏ), భారత క్రీడామంత్రిత్వ శాఖ సహా ఆసియా హ్యాండ్‌బాల్‌ సమాఖ్య, అంతర్జాతీయ హ్యాండ్‌బాల్‌ సమాఖ్యలను ఏకతాటిపైకి తీసుకురావటంతో విశేష కషి జరిపారు. దేశంలో హ్యాండ్‌బాల్‌ అభివద్దే ఏకైక ఎజెండాగా వివాదాలకు ముగింపు పలికారు. ఇటీవల జైపూర్‌లోని సవారు మాన్‌ సింగ్‌ స్టేడియంలో జరిగిన భారత హ్యాండ్‌బాల్‌ సంఘం (హెచ్‌ఏఐ) ఎన్నికల్లో జగన్‌మోహన్‌ రావు జనరల్‌ సెక్రటరీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దిగ్విజరు సింగ్‌ చౌతాలా (హర్యానా) అధ్యక్షుడిగా, ఖుస్బూ చౌదరి (ఢిల్లీ) సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు. భారత ఒలింపిక్‌ సంఘం (ఐఓఏ) మాజీ కోశాధికారి ఆనందీశ్వర్‌ పాండే ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యారు.

Spread the love