జూనియర్లకు అన్షు మద్దతు

– ఆసియా క్రీడల రెజ్లింగ్‌ ట్రయల్స్‌
న్యూఢిల్లీ : భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) నిరంతర వివాదంలో పడింది. ఆసియా క్రీడలకు భారత జట్లను ఎంపిక చేసేందుకు నిర్వహించనున్న జాతీయ ట్రయల్స్‌ నుంచి అగ్రశ్రేణి రెజ్లర్లు బజరంగ్‌ పూనియా, వినేశ్‌ ఫోగట్‌లకు మినహాయింపు ఇవ్వటంపై ఆ విభాగాల్లో పోటీపడుతున్న జూనియర్‌ రెజ్లర్లు న్యాయస్థానాన్ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ వివాదంలో జూనియర్‌ రెజ్లర్లకు అన్షు మాలిక్‌ మద్దతుగా నిలిచింది. ‘ఓ అథ్లెట్‌గా అతిపెద్ద లక్ష్యం భారత్‌కు ఒలింపిక్స్‌, ఆసియా క్రీడల్లో ప్రాతినిథ్యం వహించి పతకాలు సాధించి దేశం గర్వపడేలా చేయటం. ఆ హక్కును కాలరాస్తే అప్పుడేం చేయాలి? అని అన్షుమాలిక్‌ ట్వీట్‌ చేసింది. సెలక్షన్‌ ట్రయల్స్‌ నిర్వహించాలనే జూనియర్‌ రెజ్లర్ల డిమాండ్‌ సమంజసం. అది వారి హక్కు. జూనియర్‌ రెజ్లర్లకు నా మద్దతు ఉంటుందని అన్షు మాలిక్‌ తెలిపింది. ఇదిలా ఉండగా, భారత రెజ్లింగ్‌ సమాఖ్య అడ్‌హాక్‌ కమిటీ… బజరంగ్‌, వినేశ్‌లకు సెలక్షన్‌ ట్రయల్స్‌ నుంచి మినహాయింపు ఇవ్వటంపై నిరసిస్తూ జూనియర్‌ రెజ్లర్లు, కుటుం సభ్యులు భారత ఒలింపిక్‌ సంఘం (ఐఓఏ) అధ్యక్షురాలు పి.టి ఉషను కలిసేందుకు ప్రయత్నిస్తున్నారు. సెలక్షన్‌ ట్రయల్స్‌లో వివక్ష పూరిత నిర్ణయాలు తక్షణమే ఉపసంహరించుకోవాలని కోచ్‌ వికాస్‌ భరద్వాజ్‌ అన్నారు.

Spread the love