మేడిగడ్డను పరిశీలించిన ఎన్‌డీఎస్‌ఏ బృందం

నవతెలంగాణ – హైదరాబాద్‌: మూడు బ్యారేజీలను పరిశీలించేందుకు వచ్చిన నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్‌ఏ) నిపుణుల బృందం రంగంలోకి దిగింది. బుధవారం రాత్రి హనుమకొండలో బస చేసిన అధికారుల బృందం ఈ రోజు ఉదయాన్నే మేడిగడ్డ బ్యారేజీ వద్దకు వెళ్లింది. చంద్రశేఖర్‌ అయ్యర్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల బృందం మొదటగా ఎల్‌అండ్‌ టీ గెస్ట్‌హౌస్‌లో అధికారులతో భేటీ అయ్యారు. ఆ తర్వాత బ్యారేజీ వద్ద ఏడో బ్లాక్‌లో కుంగిపోయిన ప్రాంతం.. దిగువ భాగంలో ఏర్పడిన పగుళ్లను క్షుణ్నంగా పరిశీలించారు. గేట్ల సామర్థ్యం, కుంగుబాటుకు కారణాలపై ఈ కమిటీ పూర్తిగా అధ్యయనం చేయనుంది. ఇక్కడ పరిశీలన పూర్తి అయిన తర్వాత మధ్యాహ్నం అన్నారం, సుందిళ్ల బ్యారేజీలనూ కమిటీ పరిశీలించనుంది.

Spread the love