Thursday, May 14, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలునీట్ లీకేజీ మోడీ అసమర్థ పాలనే

నీట్ లీకేజీ మోడీ అసమర్థ పాలనే

- Advertisement -

ఎఎఫఐ జాతీయ సహాయ కార్యదర్శిఎం.డీ అతిక్ అహ్మద్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. నాగరాజు
కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి
ఎసఎఫఐ వినూత్ననిరసన


నవతెలంగాణ – ముషీరాబాద్
నీట్-2026 ప్రశ్నాపత్రం లీకేజీ అక్రమాలు వెలుగులోకి రావడం కేంద్ర ప్రభుత్వ ఘోర వైఫల్యమఁ ఎసఎఫఐ జాతీయ సహాయ కార్యదర్శి ఎండీ అతిక్ అహ్మద్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. నాగరాజు తీవ్రంగా విమర్శించారు. నీట్‌ను పారదర్శకంగా ఁర్వహించడంలో విఫలమైన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాద్‌ ఆర్‌టీసీ క్రాస్‌రోడ్స్‌ వద్ద వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు ఉరి వేసుకుని నిరసన తెలిపారు. అనంతరం జాతీయ సహాయ కార్యదర్శి మాట్లాడుతూ నీట్‌-2026 పరీక్ష రద్దుతో పేద, మధ్యతరగతి కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నా యని, విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పరీక్షను ఎటువంటి అదనపు ఫీజులు లేకుండానే సుప్రీంకోర్టు పర్యవేక్షణలో న్యాయ విచారణ జరిపి పారదర్శకంగా మళ్లీ నిర్వహించాలఁని కోరారు. లీకేజీకి కారణమైన అధికారులు, మధ్యవర్తులు, కోచింగ్‌ మాఫియాను వెంటనే అరెస్ట్‌ చేయాలని, నష్టపోయిన విద్యార్థులకు మానసిక, ఆర్థిక పరిహారం ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రాలకు తమ స్వంత ప్రవేశ పరీక్షలు నిర్వహించుకునే హక్కును కల్పించాలని, విద్యను కార్పొరేట్‌ వ్యాపారంగా మార్చే విధానాలను ఉపసంహరించుకోవాలని స్పష్టం చేశారు. దేశ యువత భవిష్యత్తుతో ఆడుకుంటున్న కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా పోరాటాలను మరింత ఉధతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం నాగరాజు మాట్లాడుతూ.. నీట్‌ ప్రశ్నాపత్రం లీకేజీ, భారీ అక్రమాలు వెలుగులోకి రావడం మోడీ ప్రభుత్వ పాలనా వైఫల్యానికి నిదర్శనమని అన్నారు. సుమారు 22.79 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు నేడు అంధకారంలో పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. 2024లో జరిగిన పేపర్‌ లీక్‌ ఘటనపై అప్పట్లో కఠిన చర్యలు తీసుకోకపోవడంతోనే నేడు ఇంత పెద్ద కుంభకోణం పునరావతమైందని, పరీక్షా వ్యవస్థను కేంద్రం కోచింగ్‌ మాఫియాకు, కార్పొరేట్‌ శక్తులకు తాకట్టు పెట్టిందని తెలిపారు. ఈ వైఫల్యానికి బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ తక్షణమే రాజీనామా చేయాలని, విఫలమైన నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీని రద్దు చేయాలఁని లేదా పూర్తిగా ప్రక్షాళన చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ కేంద్ర కమిటీ సభ్యులు ఎం. మమత, రాష్ట్ర ఉపాధ్యక్షఁలు డి. కిరణ్‌, కె. అశోక్‌ రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు భరత్‌, రమ్య, జూనుగరి రమేష్‌, హైదరాబాద్‌ నాయకులు నాగేందర్‌, ప్రవీణ్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -