Thursday, May 21, 2026
E-PAPER
Homeజాతీయంనీట్ పేప‌ర్ లీకేజీ..రాజ‌స్థాన్‌లో కాంగ్రెస్ ఆందోళ‌న‌

నీట్ పేప‌ర్ లీకేజీ..రాజ‌స్థాన్‌లో కాంగ్రెస్ ఆందోళ‌న‌

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: రాజ‌స్థాన్ కాంగ్రెస్ శ్రేణులు ఆందోళ‌న చేప‌ట్టారు. నీట్ పేప‌ర్ లీకేజీని ఖండిస్తూ జైపూర్‌లో భారీ ర్యాలీ తీశారు. బీజేపీ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు. కేంద్ర విద్యాశాఖ‌మంత్రి ధ‌ర్మంద్ర పార్ధాన్ రాజీనామా చేయాల‌ని డిమాండ్ చేశారు. రాజస్థాన్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు గోవింద్ సింగ్ డోటస్రా నేతృత్వంలో కాంగ్రెస్ రాష్ట్ర కార్యాలయం నుంచి బీజేపీ ప్రధాన కార్యాలయం వైపు నిరసన ప్రదర్శన జరిగింది. ఈ ప్రదర్శనలో ప్రతిపక్ష నాయకుడు టికారామ్ జుల్లీతో పాటు పలువురు సీనియర్ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొన్నారు. నిరసన ఉధృతం కావడంతో, బీజేపీ కార్యాలయం సమీపంలో ఆందోళనకారులను చెదరగొట్టడానికి పోలీసులు వాటర్ కెనాన్లను ఉపయోగించారు. బీజేపీ నాయ‌కుల‌ ప్రమేయం ఉంద‌ని. వీరు పేపర్ లీక్ మాఫియాపై ఎటువంటి చర్యలూ తీసుకోకుండా, వారిని రక్షించడానికి ప్రయత్నిస్తున్నార‌ని, ఈ పేప‌ర్ లీకేజీపై పీఎం మోడీ మౌనం వ‌హించ‌మేంట‌ని కాంగ్రెస్ నేతలు ప్ర‌శ్నించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -