ఇండస్ యాప్‌స్టోర్‌కు కొత్త ఊపు


ప్రధాన గేమ్ డెవలపర్ల రాకతో మరింత బలోపేతం
MPL, Dream11, Nazara Technologies, A23, RummyCulture, RummyTime, Junglee Rummy, Rummy Passion CardBaazi, Taj Rummy, and more have partnered with the Indus Appstore ఇన్-ఆప్ కమిషన్లు లేకపోవడం, స్థానిక భాషల్లో అందుబాటులోకి తీసుకురావడం లాంటి గేమ్ ఛేంజింగ్ ఫీచర్లు డెవలపర్లలో ఉత్సాహం నింపుతున్నాయి.

నవతెలంగాణ ఢిల్లీ: దేశ వ్యాప్తంగా ఉన్న వినియోగదారులకు గేమింగ్ అనుభవాన్ని విప్లవాత్మకంగా మార్చే రీతిలో ప్రముఖ గేమ్ డెవలపర్లను ఆన్ బోర్డింగ్ చేస్తున్నామని పూర్తిగా భారతదేశంలోనే నిర్మితమైన ఆండ్రాయిడ్ ఆధారిత మొబైల్ యాప్ స్టోర్ అయిన ఇండస్ యాప్‌స్టోర్ ప్రకటించింది.
వినూత్నమైన చర్యగా Dream11, Nazara Technologies, A23, MPL, Junglee Rummy, Taj Rummy, Rummy Passion, RummyCulture, RummyTime and CardBaaziలు ఇండస్ యాప్‌స్టోర్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. ఈ భాగస్వామ్యం లక్షలాది మంది వినియోగదారులకు గేమింగ్ అనుభవాన్ని మరింత విస్తృతంగా అందుబాటులోకి తీసుకురాగలమనే నమ్మకాన్నిదృఢంగా కలుగజేస్తుంది. ఇది వైవిధ్య భరితంగా, కొత్తదనానికి కట్టుబడాలనే ఇండస్ యాప్‌స్టోర్‌ నిబద్ధతకు అనుగుణంగా అనేక రకాల నాణ్యమైన గేమ్‌లను అందిస్తుంది.
ఇన్-యాప్ పేమెంట్లపై 15-30% అనే అధిక స్థాయిలో ఇతర యాప్ స్టోర్‌లు కమిషన్లను వసూలు చేస్తుండగా, దానికి పూర్తి భిన్నంగా ఎలాంటి కమిషన్ తీసుకోకపోవడమనే ముఖ్యమైన అంశం డెవలర్లకు సహాయం చేయాలనే ఇండస్ యాప్‌స్టోర్‌ చిత్తశుద్ధిని చాటుతోంది. ఈ విప్లవాత్మకమైన ముందడుగు చర్య ఎలాంటి ఆర్థిక పరిమితులు లేకుండా పూర్దిగా లీనమయ్యే గేమింగ్ అనుభవాల రూపకల్పనపై దృష్టి కేంద్రీకరించేందుకు డెవలపర్లకు పూర్తి శక్తిని ఇస్తుంది. అంతేకాకుండా, ప్లాట్ ఫారం యొక్క స్థానికీకరణ ఫీచర్ ద్వారా వినియోగదారు ఎంచుకున్న భాషలో కంటెంట్ అందిస్తుండడం ఈ గేమ్స్ ను ఇప్పుడు భారతదేశంలోని ప్రతి మూలకూ చేరుకునేలా చూస్తోంది.
ఈ భాగస్వామ్యం గురించి ఇండస్ యాప్‌స్టోర్‌ కో-ఫౌండర్ ఆకాశ్ డోంగ్రే మాట్లాడుతూ, “ఈ గేమింగ్ దిగ్గజాలను ఇండస్ యాప్‌స్టోర్‌ కుటుంబంలోకి ఆహ్వానించడం మాకెంతో సంతోషంగా ఉంది. వారి నైపుణ్యం, అత్యున్నత స్థాయి గేమింగ్ అనుభవాలను అందించాలనే నిబద్ధత మా విజన్ తో పూర్తిగా కలసిపోతుంది. ఈ సంస్థలతో కలసి, భారతదేశ గేమింగ్ రంగం పురోగతిని కొత్త శిఖరాలకు తీసుకెళ్లగలమని ఆశిస్తున్నాము.” అని అన్నారు.
మా భాగస్వాముల మాటల్లో:
CardBaazi సంస్థ CEO సునీత్ వారైచ్ మాట్లాడుతూ, ” ఇండస్ యాప్‌స్టోర్‌తో, మేము కార్డ్ గేమింగ్ రంగాన్ని పునర్నిర్వచించడానికి సిద్ధంగా ఉన్నాము. ఇది ఆటగాళ్లకు కేవలం వినోదాన్ని పంచడానికి మాత్రమే పరిమితం కాకుండా, న్యాయ సమ్మతమైన, ప్రతిఫలాన్నిచ్చే సంబంధాలను కూడా ప్రోత్సహిస్తుంది. Cardbaazi యొక్క లోతైన గేమ్ ప్లే, ఇండస్ యాప్‌స్టోర్‌ యొక్క సహకార వాతావరణంతో మేము తిరుగులేని కార్డ్ గేమింగ్ సాహస క్రీడలను అందించేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాము. ఇన్-యాప్ కొనుగోళ్లపై కమిషన్ లేకపోవడం వల్ల న్యాయంగా ఆడుతూ, ఆటను ఆస్వాదించాలనే ఆసక్తి, ఉత్సాహం కలిగిన గేమింగ్ కమ్యూనిటీని ప్రోత్సహిస్తున్నాము” అని అన్నారు.
MPL VP Marketing మనీశ్ శ్రీవాస్తవా మాట్లాడుతూ “ఆసక్తి కలిగించే ఆటల జాబితాను కలిగిన ప్లాట్ ఫారంగా, దేశం నలుమూలలకు చెందిన వ్యక్తులకు గేమింగ్‌ను యాక్సెస్ చేయడమే MPL ఆశయం. ఇది ప్లేయర్లకు తాము కోరుకున్న నైపుణ్యంతో కూడిన గేమ్ లను ఆడే అవకాశం కల్పిస్తుంది. ఇండస్ యాప్‌స్టోర్‌తో భాగస్వామ్యం కుదుర్చుకోవడం వల్ల మేము నిర్మిస్తున్న భారతదేశానికి మరింత చేరువ కావడంలో మాకు సహాయపడుతుంది.” అని అన్నారు.
Rummy Passion సంస్థ CMO అమన్ దీప్ సింగ్ మాట్లాడుతూ, “ఇండస్ యాప్‌స్టోర్‌లో Rummy Passion ప్రభావాన్ని పరిశీలించాలనుకోవడాన్ని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము. అలాగే, గణనీయమైన వృద్ధి అవకాశాన్ని అన్వేషించాలనే ఉత్సాహంతో ఉన్నాము. భారతదేశం కేంద్రంగా నెలకొల్పిన సహాయ బృందం ప్రత్యేకంగా నిలుస్తూ, తక్షణ, అంకితభావంతో కూడిన సహాయాన్ని అందిస్తోంది. ఇది ఒక అమూల్యమైన వనరుగా వినియోగదారుకు అవాంతరాలు లేని అనుభవాన్ని అందేలా చూస్తోంది. ఈ భాగస్వామ్యం వినియోగదారులలో మా ఉత్పత్తి స్వీకరణ, పాలు పంచుకోవడం బాగా పెరిగేలా చేయడంలో సహాయాన్ని అందిస్తుందని నమ్ముతున్నాము” అని పేర్కొన్నారు.
Gameskraft సంస్థ AVP Marketing ప్రతీక్ సాహు: “ఇండస్ యాప్‌స్టోర్‌తో మా భాగస్వామ్యం Gameskraftకు సరికొత్త ఆడియన్స్ వద్దకు చేరుకునేందుకు దారులను తెరుస్తుంది. వారి చాతుర్యమైన వీడియో కేంద్రీకృత యాప్ డిస్కవరీ అనుభవం మా యాప్‌ల గురించి చాలా లోతైన అవగాహనను ప్రేరేపించడంలో సహాయపడుతుంది. భారతదేశపు మొట్టమొదటి యాప్ స్టోర్‌లో భాగంగా ఉండడం వల్ల మరింత ఎక్కువ మంది ప్రేక్షకులకు చేరువ కాగలమని మేము ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము.” అని చెప్పారు.

Nazara Technologies సంస్థ COO సుధీర్ కామత్,: “వివిధ ప్లాట్ ఫారంలలోని ప్లేయర్లకు వైవిధ్యమైన గేమింగ్ అనుభవాలను తీసుకురావాలనే మా అంకిత భావానికి అనేక రకాల నాణ్యమైన యాప్‌లతో ఆటగాళ్లకు అవకాశాలు కల్పించాలనే ఇండస్ యాప్‌స్టోర్‌ దార్శనికత చక్కగా సరిపోతోంది. ఈ వినూత్న ప్లాట్ ఫారంలో చేరడం మాకెంతో ఆనందంగా ఉంది. ఇది మమ్మల్ని మరింత ఎక్కువ మంది దగ్గరకు తీసుకువెళ్లి, ఎక్కువ మందికి మా ఉత్సాహపూరిత గేమ్ లను అందించేలా చేయగలదు” అని వ్యాఖ్యానించారు.

Taj Rummy సంస్థ Head of Marketing భానుచందర్ బి: “స్థానికీకరించిన యాప్ అనే సానుకూలతతో కూడిన ఇండస్ యాప్‌స్టోర్‌ విలక్షణత మాతో బాగా కలసిపోతుంది. —వారి భాష, సంస్కృతిని ఆలింగనం చేసుకోవడం ద్వారా ఇది భారత్‌తో కనెక్ట్ అయ్యే వారధిగా నిలుస్తుంది. చక్కగా అల్లిన ఈ విధానం ప్రేక్షకులకు మమ్మల్ని మరింత బాగా దగ్గర చేసి, మరింత వ్యక్తిగతీకరించిన గేమింగ్ అనుభవాన్నివారికి అందించేలా సహాయపడుతుంది. ఇండస్ యాప్‌స్టోర్‌ తో కలసి మేము రమ్మీ గేమింగ్ ఆనందాన్ని మరింత శిఖర స్థాయికి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యాము. తద్వారా వివిధ రకాల అభిరుచులు కలిగిన ఆడియన్స్ అవసరాలను మా ప్లాట్ ఫారం ప్రతిధ్వనించేలా చూస్తుంది.” అని అన్నారు.
A23 సంస్థ Senior Director, Acquisition సుదర్శన్: “ఇండస్ యాప్‌స్టోర్‌తో చేతులు కలిపి, మా గేమింగ్ అనుభవాన్ని మరింత విస్తృతంగా ఔత్సాహికుల వద్దకు తీసుకువెళ్లడం మాకెంతో ఆనందంగా ఉంది. సరైన లక్ష్యంతో కూడిన ప్రకటన పరిష్కారాలతో, మేము సరైన యూజర్లకు చేరుకుని, వారిని సరైన రీతిలో పాల్గొనేలా చేసి, మార్పిడీలను ముందుకు తీసుకువెళ్లేందుకు సిద్ధమయ్యాము. ఇండస్ యాప్‌స్టోర్‌ ముందుగానే సిద్ధం చేసిన ప్రకటన పరిష్కారాలతో మేము ప్రేక్షకులను ఆకట్టుకుని, గేమింగ్ అనుభవాన్ని మెరుగుపరిచేలా సాగించే ఈ ఉత్సాహపూరిత యాత్రలో పాలు పంచుకోవాలి.” అని పిలుపునిచ్చారు.
భారతదేశం నలుమూలల్లోని డెవలపర్లు ఇండస్ యాప్‌స్టోర్‌ లో భాగస్వాములై, తమ యాప్ లను ప్రదర్శించుకోవచ్చు. దీనికోసం వారు చేయాల్సిందల్లా, ఇండస్ యాప్ స్టోర్ ను సందర్శించి, డిజిటల్ ముఖ చిత్రంలో కొత్త కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించే వ్యక్తిగా ఉండాలి. ఇండస్ యాప్ స్టోర్ పరిచయం: ఇండస్ యాప్ స్టోర్ అనేది ఒక స్థానిక ఆండ్రాయిడ్ ఆధారిత మొబైల్ యాప్ స్టోర్. స్థానికీకరించిన, సాంస్కృతిక అవసరాలను పూర్తి చేసేలా రూపకల్పన చేయబడింది. విస్తృతమైన విభాగాల శ్రేణితో, వినియోగదారులకు స్థానికీకరించిన, సందర్భోచితమైన, వ్యక్తీకరించిన అనుభవాన్ని అందించాలని ఇది కోరుకుంటోంది. ఇండస్ యాప్ స్టోర్ ఆంగ్లంతో పాటు 12 భారతీయ భాషల్లో అందుబాటులో ఉంది. ఇది వినియోగదారులు తమకు నచ్చిన భాషలో యాప్ స్టోర్‌ను అన్వేషించేందుకు అనుమతిస్తుంది. డెవలపర్లకోసం, ఇండస్ యాప్ స్టోర్ భారతీయ యాప్ వాతావరణంలో తమ ఉత్పత్తులను లిస్ట్ చేసేందుకు, వినియోగించేందుకు, ప్రమోట్ చేసుకునేందుకు ఒక న్యాయ సమ్మతమైన రీతిలో అందరికీ సమాన అవకాశాలను అందిస్తోంది. ప్రత్యేకంగా 24×7 రీతిలో పని చేసే ఒక కస్టమర్ సహాయ విభాగంతో వారి యాప్‌లను పర్యవేక్షించి, ముందుకు తీసుకువెళ్లే రీతిలో సెల్ఫ్ పబ్లిషింగ్ వేదికను, స్థానికీకరించిన సేవలను, అనేక పరికరాలను అందిస్తోంది.

Spread the love