నూతనంగా ప్రారంభించనున్న వాసవి రెసిడెన్సీ..

Oplus_131072

– ఆతిథ్య సేవా రంగంలో రాణిస్తున్న అశ్వారావుపేట..
– ఇప్పటికే అయిదు లాడ్జి లు నిర్వహణ..
– వాసవి రెసిడెన్సీ పేరుతో మరొకటి నిర్మాణం..
– బుధవారం ప్రారంభించనున్న ఎమ్మెల్యే జారే..
నవతెలంగాణ – అశ్వారావుపేట
నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట ఆతిథ్య సేవారంగంలో రాణిస్తుంది.ఇప్పటికే ఐదు లాడ్జి లు,రెండు పంక్షన్ హాల్ లో ఆతిథ్య రంగంలో విస్త్రుత సేవలు అందుబాటులో ఉన్నాయి.వాసవి రెసిడెన్సీ పేరుతో ఆధునిక సదుపాయాలతో మరోకటి నిర్మితం అయింది.ఈ నూతన లాడ్జి ని స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ బుధవారం  ప్రారంభించనున్నట్లు లాడ్జి యజమాని తోకలు హరీష్ మంగళవారం తెలిపారు. అశ్వారావుపేట తెలంగాణ – ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో ఉండటంతో ఈ ప్రాంతానికి వేరుశనగ, మామిడి, ప్రత్తి, అరటి, ధాన్యం వ్యాపారులు ఇతర రాష్ట్రాల నుండి వచ్చి సీజన్ పూర్తి అయ్యే వరకు ఇక్కడే మకాం ఉండి వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తుంటారు. దీంతో ఆతిథ్య సేవారంగంలో అశ్వారావుపేట గుర్తింపు తెచ్చుకుంది. వెంకటేశ్వర, చందన, ఆలపాటి, లహరి, వెంకట సాయి సుధ పేర్లతో లాడ్జి లు,శ్రీ శ్రీ,సాయి రంగా పేర్లతో ఫంక్షన్ హాల్ అశ్వారావుపేట లో ఆతిథ్య రంగంలో సేవలు అందిస్తుండగా నూతనంగా వాసవి రెసిడెన్సీ ప్రారంభం కానుంది.

Spread the love