ధీమా ఇవ్వని భీమా..!

– ఏండ్లు గడుస్తున్న అందని ఇన్సూరెన్స్‌.
– కార్మికశాఖలో పెండింగ్‌లో వందలాది దరఖాస్తులు
– కార్యాలయంలో మద్యవర్తుల పెత్తనం
– కమీషన్‌ ఇస్తేనే ఫైళ్లు కదులుతున్నాయనన్న ఆరోపణ
– ముడుపుల కోసమే జాప్యం చేస్తున్నారంటోన్న బాధితులు
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
కార్మికశాఖలో సభ్యత్వం కలిగి ఉండి బీమాకు దరఖాస్తులు చేసుకున్న లబ్దిదారుల కుటుంబాలకు భరోసా లబించడం లేదు. భవన నిర్మాణ పనుల్లో, రోడ్డు ప్రమాదాలకు గురి అయ్యి, అంగవైకల్యం పొందిన,  చనిపోయే కార్మికులకు అందాల్సిన బీమా ప్రయోజనలు సకాలంలో అందక భాదిత కుటుంబాలు ఏండ్ల తరబడి కార్మికశాఖ కార్యాలయం చుట్టూ ప్రదక్షణాలు చేస్తున్నారు. కార్మికుల ప్రయోజనాల కోసం ప్రవేశ పెట్టిన పధకాలు క్షేత్ర స్థాయీలో కార్మికులకు అందేలా చూడాల్సిన అధికార యంత్రాంగం పట్టించుకోకపోవడంతో కార్మికులకు శాపంగా మారింది. ప్రభుత్వ నిబంధన ప్రకారం దరఖాస్తు చేసుకున్న ఏదో ఒక కారణం చూపిస్తూ ఏళ్ల తరబడి పెండింగ్‌లో పెడుతున్నారని బహిరంగంగానే విమర్శలు వస్తున్నాయి.  దళారుల ద్వారా వచ్చిన లబ్దిదారులకు మాత్రం వెంటనే లబ్దిచేకూరుతున్నదని పిర్యాదు అందుతున్నాయి.
పెండింగ్‌లో వేలాది దరఖాస్తులు..
కార్మిక శాఖలో నమోదైన భవన నిర్మాణ కార్మికులు ప్రమాదాల్లో మరణించిన, శాశ్వత అంగవైకల్యానికి గురి అయినా.. ఆ కుటుంబాలకు రూ.6.30లక్షలు, సాధారణ మరణానికి రూ. 1.30లక్షలు, తాత్కలిక అంగవైకల్యానికి రూ. 1లక్ష నుంచి రూ. 3లక్షల వరకు, మహిళా కార్డుదారు, కార్డుదారు కూతురు వివాహ కానుకగా రూ. 30 వేలు, ప్రశుతీ కానుకగా (రెండు కాన్పులకు) రూ. 30 వేల  చొప్పున బీమా పరిహారాన్ని కార్మిక శాఖ అందిస్తుంది.  కార్డు దారుడు మరణం చెందితే డెత్‌ సర్టిఫికేట్, లేబర్‌ డిపార్ట్‌మెంట్‌ జారీ చేసిన  లేబర్‌కార్డ్‌తో పాటు ఆధార్, బ్యాంక్‌ అకౌంట్‌లతో మీ సేవ కేంద్రలలో దరఖాస్తు చేసుకోవాలి. దీంతో తక్షణమే ఈ పరిహార మొత్తాన్ని సంబందిత కార్మికుడి నామినికి అందిస్తారు. అదే విదంగా ఇతర బెనిపిట్స్‌కు సంబంధిత దృవపత్రాలతో దరఖాస్తులు చేసుకుంటారు. అయితే  జిల్లాలో ఈ పథకం అమల్లో మాత్రం జాప్యం జరుగుతుంది. 2020 సంవత్సరంలో వివిద కేటగిరిల కింద 1075 దరఖాస్తులు వస్తే వాటిలో 36 పెండింగ్‌లోనే ఉండగా,  2021 సంవ్సర్సారంలో 1266 దరఖాస్తులు రాగా 833, 2022 సంవత్సరంలో 1751 దరఖాస్తులకు గాను  25 పెండింగ్, 2023 సంవత్సరంలో 1321 దరఖాస్తులకు  437 పెండింగ్‌లోనే ఉన్నాయి.
దళారుల దందా…
కార్మికశాఖలో దళారుల దంధా కొనసాగుతుందనే పిర్యాదులు ఉన్నాయి. ఈ విషయంపై ఇటీవల ప్రజావాణిలో కలెక్టర్‌కు పిర్యాదు చేయగా, జిల్లా పరిషత్‌ సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది.  భీమా, పరిహారం రావాలంటే దళారీల నుండి రఖాస్తులువస్తేనే ఫైళ్ళు కదులుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి.
డబ్బులు తీసుకొని కూడా న్యాయం చేయలేదు.

సూర్యాపేట పట్టణానికి చెందిన ఓ మహిళా తన భర్త ప్రమాదవశాత్తు మృతి చెందగా లేబర్‌ ఇన్సూరెన్స్ కు 2021లో దరఖాస్తు చేసుకున్నది. కార్మికశాఖలో పనిచేస్తున్న సిబ్బంది, మీసేవ నిర్వహకులు కలిసి బీమా సొమ్ము ఇప్పిస్తామని రూ. 30 వేలు ఆమె వద్ద నుంచి తీసుకున్నారు. కాని బీమా అందకపోవడంతో బాదితురాలు ప్రశ్నిస్తే దరఖాస్తు తప్పుగా నమోదైనదని దరఖాస్తు రిజెక్ట్‌ చేసినట్లు బాదితురాలు తెలుపుతున్నారు.

Spread the love