గాలివాన బీభత్సానికి మరోసారి కూలిన ఓడేడు బ్రిడ్జి గిర్డర్

నవతెలంగాణ-ముత్తారం: పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలంలోని ఓడేడు – జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మం డలం గర్మిళ్లపల్లి గ్రామాల మధ్య మానేరుపై నిర్మాణంలో ఉన్న బ్రిడ్జీ గర్డర్లు గాలి వాన బీభత్సానికి మరోసారి నేలకూలాయి. మంగళవారం సాయంత్రం ఒక్కసారిగా గాలి వాన బీభత్సం సృష్టించింది. దీంతో మానేరుపై నిర్మాణంలో బ్రిడ్జీకి సంబంధించి 17, 18 పిల్లర్ల మధ్యన ఉన్న గర్డర్లు నాలుగు ఒక్కసారిగా కుప్పకూలాయి. పెద్ద శబ్దం అవుతూ గర్డర్లు ఒక్కసారిగా కుప్పకూలడంతో అక్కడున్న  వారు భయాందోళనకు గురయ్యారు. గర్డర్లు కూలిన సమయంలో వంతెనకు సమీపంలో అక్కడ ఎవ రూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. గతంలో ఏప్రిల్ 23న కూడా గాలివాన బీభత్సంతో వంతెనకు సంబంధించిన గర్డర్లు మూడు నేల కూలాయి. అప్పుడు చీఫ్ ఇంజనీర్ మోహన్ నాయక్ మనేరు వంతెనను సందర్శించి, గర్డర్ల కింద ఏర్పాటు చేసిన చెక్కలను తొలగించాలని సంబంధిత కాంట్రాక్టరు సూచనలు చేశారు. అంతేగాకుండా నాణ్యత లోపించిన గర్డర్లను తొలగించాలని ఆదేశిoచినప్పటికీ సదరు కాంట్రాక్టర్ నిర్లక్ష్యం మూలంగా మళ్లీ గర్డర్లు కుప్పకూలాయని పలువురు ఆరోపణలు చేస్తున్నారు.
Spread the love