Tuesday, April 21, 2026
E-PAPER
Homeకరీంనగర్ఉద్యాన, పల్బారీ పంటలను పరిశీలించిన అధికారి

ఉద్యాన, పల్బారీ పంటలను పరిశీలించిన అధికారి

- Advertisement -

నవతెలంగాణ-రాయికల్
మండలంలోని ఆలూరు, వీరాపూర్, ధర్మాజీపేట, ఒడ్డెలింగాపూర్ గ్రామాల్లో జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ అధికారి కె.లత క్షేత్ర స్థాయి పర్యటన నిర్వహించారు. ఉద్యాన పంటలు, మల్బరీ సాగు, మష్రూమ్ పెంపకాన్ని పరిశీలించి రైతులకు పలు సూచనలు చేశారు. టమాటలో ఎండు తెగులు నివారణకు ట్రైకోడర్మా వంటి జీవ ఎరువులు వినియోగించాలని సూచించారు. కోతుల బెడద నివారణకు సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేసిన రైతును అభినందించారు.

ఆయిల్ పామ్ తోటల్లో డ్రిప్ ద్వారా సమయానికి నీరు అందిస్తే దిగుబడి మెరుగవుతుందని తెలిపారు. లిల్లీ పూల సాగులో సస్యరక్షణ చర్యలు వివరించారు. మల్బరీ సాగుతో తక్కువ కాలంలో ఆదాయం సాధ్యమని, షెడ్డు నిర్మాణానికి రూ.2.25 లక్షల వరకు సబ్సిడీ అందుబాటులో ఉందని చెప్పారు. మష్రూమ్, పట్టు పురుగుల పెంపకం రైతులకు లాభదాయకమని వివరించారు. ప్లాస్టిక్ మల్చింగ్, డ్రిప్ సదుపాయాలపై రాయితీలు ఉన్నాయని, ఆసక్తి గల రైతులు ఉద్యాన శాఖను సంప్రదించాలని సూచించారు. ఈ పర్యటనలో జగిత్యాల నియోజకవర్గ ఉద్యాన అధికారి కె.స్వాతి, ఉద్యాన విస్తరణ అధికారి రాజేష్, ఆయిల్ పామ్ కంపెనీ సిబ్బంది రైతులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -