ఉపాధి కూలీలకు రూ 307 లు పకడ్బందీగా అమలు చేయాలి
వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు జగన్
నవతెలంగాణ – మిడ్జిల్
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఉపాధి కూలీలందరికీ వెంటనే డబ్బులు చెల్లించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు పోలే జగన్ డిమాండ్ చేశారు. మంగళవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ఎదుట కూలీలకు డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. మండలంలోని వేముల, వల్లభరావుపల్లి, రాణిపేట్, కొత్తపల్లి, చిల్వేర్ ,వస్ఫూల ,మున్ననూర్, అయ్యవారిపల్లి , వెలుగొమూల మిడ్జిల్ , బోయిన్పల్లి ఉపాధి ప్రదేశాలలో ఉపాధి కూలీలు గత రెండు నెలలుగా కూలీ డబ్బులు రాక ఉపాధి పనులకు దూరం అవుతున్న పరిస్థితి కనబడుతుందని ఆయన మాట్లాడారు.
ఉపాధి పనులు జరిగే చోట కనీసం మంచినీళ్లకు నోచుకోకుండా దెబ్బలు ఫస్ట్ ఎయిడ్ బాక్సులు టెంట్ల సౌకర్యం లేక ఎర్రటి ఎండలో పనులు చేస్తున్న పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. పనిచేసిన డబ్బులు రాకుంటే పప్పు, నూనె కూడా డబ్బులు దొరకడం లేదని విమర్శించారు. కూలీ డబ్బులు రాక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఐ ఫోటో సిస్టంతో ఉపాధి పనులకు వెళ్ళని పరిస్థితి ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టాయని ఇట్టి ఫోటో విధాన్ని వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
అదేవిధంగా వార వారం పే స్లిప్పులు ఇవ్వాలని పనిముట్లు పారా, గడ్డపార, కొడవలి గొడ్డలి లాంటి పనిముట్లను సరఫరా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం 60 శాతం రాష్ట్ర ప్రభుత్వం 40% నిధులు మంజూరు చేయాలని నిబంధన వెనక్కి తీసుకొని గతంలో ఏదైతే నడిచిందో అదే విధానాన్ని కొనసాగించాలని, వి బి జి రామ్ జి చట్టాన్ని వెనక్కి తీసుకొని ,మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యధావిధిగా అమలు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఎంపీడీవో గీతాంజలికి అందజేశారు. ఈ కార్యక్రమంలో గడ్డల మధు, జంగయ్య, బాలమణి ,లలిత, జయమ్మ, , మహేష్ , జంగయ్య తదితరులు పాల్గొన్నారు.



