రోడ్డు నిర్మాణం పనులు పరిశీలిస్తున్న అధికారులు, నాయకులు

– రోడ్ నిర్మాణంలో అభ్యంతరాలు

– నిలిచిపోయిన పనులు..

– కొలతలు, నిబంధనలు నివృత్తి చేసిన డీ.ఈ రామిరెడ్డి..
– పనులు ప్రారంభించిన కాంట్రాక్టర్..
నవతెలంగాణ – అశ్వారావుపేట 
గిరిజన సంక్షేమ శాఖ నిధులతో మంజూరైన బీటీ రోడ్ నిర్మాణం లో రహదారికి ఇరువైపుల గృహ వాసులు,రైతులు శుక్రవారం అభ్యంతరం తెలపడంతో కాంట్రాక్టర్ పనులు నిలిపి వేసారు. విషయం తెలుసుకున్న ఐటిడిఏ డీఈ రామిరెడ్డి,ఏఈ ప్రసాద్ లు శనివారం పని ప్రదేశాన్ని సందర్శించి రహదారి నిర్మాణ పనులు ను పరిశీలించారు.ఈ విషయం రైతులు,కాంగ్రెస్ నాయకులు మొగళ్ళపు చెన్నకేశవ రావు లు అక్కడకు చేరుకున్నారు. నందమూరి నగర్ నుండి పేట మాలపల్లి వరకు 3.4 కి.మీ లు,రూ.2 కొట్లు 72 లక్షల వ్యయంతో నిర్మించనున్నారు.ఏడున్నర వెడల్పు తో రహదారి మట్టి పనులు చేసి,కంకర వేసి,తారు వేసి కల్వర్టు లు నిర్మించాలి. ముందుగా కాంట్రాక్టర్ మధుసూధన్ రావు ఎర్త్  వర్క్ ప్రారంభించాడు. అయితే ఎడమవైపు వైపు తెలంగాణ, కుడివైపు ఆంధ్రా భూ భాగం మీదుగా ఈ రోడ్ నిర్మాణం సాగడం భూములు కోల్పోతున్నాయి అంటూ రైతులు,గృహాలు పాక్షికంగా శిధిలం అవుతున్నాయి అంటూ గృహ వాసులు అభ్యంతరాలు తెలపడంతో శుక్రవారం పనులు నిలిపివేసారు. దీంతో శనివారం డీ.ఈ రామిరెడ్డి,ఏఈ ప్రసాద్ లు రహదారి కొలతలు,నిబంధనలు వివరించి చెప్పారు.ఎవరికీ నష్టం కలగకుండా రహదారి నిర్మాణం చేపడతామని అన్నారు.రోడ్డు నిర్మాణం తో భూములకు విలువ పెరుగుతుందని అన్నారు.చెన్నకేశవ రావు,సత్యవరుపు బాలగంగాధర్ రైతులకు,గృహ వాసులకు సర్దిచెప్పారు.దీంతో కాంట్రాక్టర్ మధుసూధన్ రావు పనులు ప్రారంభించారు.
Spread the love