నవతెలంగాణ-మద్నూర్: బాన్సువాడలో రూ. 50.00 లక్షల ఎస్ డి ఎఫ్ నిధులతో నిర్మించిన నూతన ఆర్డీఓ క్యాంప్ కార్యాలయ భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు పాల్గొన్నారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..ప్రజల సమస్యలను అధికారులు సత్వరమే గుర్తించి, పారదర్శకంగా పరిష్కరించే విధంగా పని చేయాలని సూచించారు.ప్రభుత్వ అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి, వారి సమస్యలను వినడం మాత్రమే కాకుండా వాటి పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేయాలని కోరారు.ప్రభుత్వ కార్యాలయాలు ప్రజలకు సేవలు అందించే కేంద్రాలుగా ఉండాలని, ప్రజలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పనులు పూర్తి చేసుకునేలా సహకరించాలని సూచించారు.అలాగే బాన్సువాడ నూతన ఆర్డీఓ రవీందర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, బాన్సువాడ–జుక్కల్ పరిధిలో జుక్కల్ నియోజకవర్గానికి చెందిన 8 మండలాలు ఉన్నందున తమ ప్రాంత ప్రజల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారులు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి , కలెక్టర్,ఆర్డీఓ, డిఎస్పి,ఇతర అధికారులు బాన్సువాడ డివిజనల్ పరిధిలోని ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ప్రజా సమస్యలను అధికారులు సత్వరమే పరిష్కరించాలి: ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు
- Advertisement -
- Advertisement -



