నవతెలంగాణ-హుస్నాబాద్ రూరల్: సీసీ కెమెరాలు నేరాల నియంత్రణకు ఎంతో ఉపయోగపడతాయని హుస్నాబాద్ ఏసిపి సదానందం అన్నారు శుక్రవారం హుస్నాబాద్ మండలంలోని తోటపల్లి గ్రామంలో గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ బంక లక్ష్మీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను హుస్నాబాద్ ఏసీపీఎస్. సదానందం, హుస్నాబాద్ ఎస్సై పి.లక్ష్మారెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బంక చందు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సిద్దిపేట సీపీ రష్మీ పెరుమాళ్ ఆధ్వర్యంలో జిల్లాలో గ్రామాల భద్రత కోసం సీసీ కెమెరాల ఏర్పాటు చేపడుతున్నామని తెలిపారు. నేర పరిశోధనల్లో సీసీ ఫుటేజీలు కీలక ఆధారాలుగా ఉపయోగపడుతున్నాయని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. తప్పనిసరిగా లైసెన్సు, ఇన్సూరెన్స్ పత్రాలు కలిగి ఉండాలన్నారు. యువత డ్రగ్స్, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వొద్దని సూచించారు. ఆన్లైన్ గేమ్స్, బెట్టింగ్ యాప్స్ వల్ల ఆర్థిక నష్టాలు ఎదురవుతున్నాయని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ వార్డు సభ్యులు, మానుక కుమార్,శాతవేణి అనూష,చందు, బొంగుని రేణుక, రమేష్, గూళ్ల ఎల్లవ్వ గ్రామ కార్యదర్శి మహేందర్, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.



