నవతెలంగాణ – కరీంనగర్: జగిత్యాలలో ప్రోటోకాల్ వివాదం నెలకొంది. శిలాఫలకంపై జెడ్పీ ఛైర్మెన్ పేరు లేకపోవడంతో కోరుట్ల ఎమ్మెల్యే అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇదేమీ జగిత్యాల నియోజకవర్గం కార్యక్రమం కాదు కదా అంటూ అధికారులపై మండిపడ్డారు. తన నియోజక వర్గం అయినా కూడా పెట్టాల్సిందే అంటూ జగిత్యాల ఎమ్మెల్యే క్లారిఫికేషన్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ప్రారంభం రోజే శిలాఫలకాన్ని అధికారులు తొలగించారు. మెడికల్ కాలేజీలో 50 పడకల క్రిటికల్ కేర్ భవన శంకుస్థాపనలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ క్రమంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.