పరిశుభ్రతపై అధికారులు గ్రామస్థులకు అవగాహన కల్పించాలి

– సర్వసభ్య సమావేశంలో ఎంపీపీ కొక్కుల కీర్తి సురేష్‌
నవతెలంగాణ – కోహెడ
పరిశుభ్రతపై గ్రామస్థులకు అవగాహన కల్పించాలని ఎంపీపీ కొక్కుల కీర్తి సురేష్‌ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని మండల ప్రజాపరిషత్‌ కార్యాలయంలో సర్వసభ్య సమావేశాన్ని ఎంపీపీ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ శాఖల పనితీరుపై సమావేశాన్ని నిర్వహించారు. గ్రామాలలో దోమలు ఎక్కువగా వ్యాప్తి చెందుతున్నాయని వాటి నివారణకు సరైన చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే వ్యక్తిగత పరిశుభ్రతతో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. వేసవికాలంలో నీటి కొరత రాకుండా ప్రత్యేక అధికారులు అందుబాటులో ఉండి తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. మార్చి 3,4 తేదిలలో పోలియో చుక్కలపై చిన్నారుల తల్లిదండ్రులకు తెలియజేయాలన్నారు. అలాగే 24 గంటల విద్యుత్‌ అందేలా అధికారులు తగిన ఏర్పాట్లు చూడాలన్నారు. అలాగే కోళ్లకు, మేకలకు, గొర్రెలకు బర్డ్‌ఫ్లూ వస్తున్నందున మందులను ఎప్పటికప్పుడు అందించాలన్నారు. గ్రామాలలో ప్రజలు ఎదుర్కోంటున్న పలు సమస్యలపై స్పందించి ప్రత్యేక అధికారులు, కార్యదర్శులు, సంబంధిత అధికారులు పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో కిష్టయ్య, తహాశీల్దార్‌ కె.సురేఖ, ఎంపీటీసీలు, ప్రత్యేక అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Spread the love