నవతెలంగాణ-శంషాబాద్
మండలం పరిధిలోని గొల్లపల్లి కుర్దూ గ్రామ రెవెన్యూ సర్వేనెంబర్ 219లో సుమారు 8 ఎకరాల్లో ప్రభుత్వ నిబం ధనలను వ్యతిరేకంగా అసైన్డ్ భూమి, చౌదరిగూడ గ్రామ రెవెన్యూలో 14,15,16 నెంబర్లలో కొంతమంది సీలింగ్ భూమి ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారు. విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు ఘటనాస్థలానికి వెళ్లి నిర్మాణాలను మంగళవారం నిలిపివేశారు. తహసీల్దార్ కొ ప్పెర నాగమణి ఆదేశాల మేరకు రెవెన్యూ ఇన్‌స్పెక్ట్టర్ సారిక తన సిబ్బందితో కలిసి అడ్డుకున్నారు. గత ఫిబ్రవరి నెలలో చౌదరిగూడలో సీలింగ్ భూమి కబ్జాలను రెవెన్యూ అధికా రులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా రెవెన్యూ అధికారి మాట్లాడుతూ ఎవరైనా ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే కఠినచర్యలుతీసుకుంటామని హెచ్చరించారు.