అనుమానాస్పద స్థితిలో వృద్దురాలి మృతి..

నవతెలంగాణ – మెదక్: అనుమానాస్పద స్థితిలో వృద్దురాలు మృతి చెందిన ఘటన మెదక్ జిల్లా పరిధిలోని చిన్న కోడూరు మండలం గంగాపూర్‌లో చోటుచేసుకుంది వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన అంతగిరి సత్యవ్వ (70) మంగళవారం రాత్రి కాలుజారి కింద పడిపోయిందని కొడుకు చంద్రశేఖర్ సిద్దిపేట ఏరియా ఆస్పత్రికి తరలించాడు. అయితే సత్తవ్వ అప్పటికే మృతి చెందిందని వైద్యులు వెల్లడించారు.  సమాచారం అందుకున్న పోలీసులు కొడుకును విచారించి పోస్టుమార్టం నిమిత్తం సిద్దిపేట జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలానికి ఏసీపీ మధు, సీఐ శీను, ఎస్సై బాలకృష్ణ చేరుకుని పూర్తి ఆధారాలు సేకరిస్తున్నారు. వృద్ధురాలు సత్యవ్వది హత్యా లేదా ప్రమాదవశాత్తు జరిగిందా.. అనేది త్వరలోనే విచారణ చేపట్టి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.

Spread the love