వాడీివేడిగా సాగిన వాదనలు.. నేడు బాధితురాలి తరఫున వాదనలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, బీజేపీ నేత బండి సంజరు కుమారుడు బండి సాయి భగీరథ్ దాఖలు చేసిన మధ్యంతర ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు శుక్రవారం తీర్పు ఇవ్వ నుంది. ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచా రణను వచ్చే వారానికి వాయిదా వేసిన కోర్టు, ప్రస్తుతం అరెస్టు నుంచి తాత్కాలిక రక్షణ కల్పించాలనే అభ్యర్ధనపైనే విచారణ చేస్తున్నట్లు స్పష్టం చేసింది. దీనిపైనే ఇరుపక్షాల వాదనలు పూర్తి చేసి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేస్తామని జస్టిస్ మాధవీదేవి గురువారం ప్రకటించారు. పేట్‌బషీరాబాద్ పీఎస్‌లో నమోదైన పోక్సో కేసులో అరెస్టు చేయకుండా రక్షణ కల్పించాలని కోరుతూ భగీరథ్ వేసిన పిటిషన్ తరఫు సీని యర్ లాయర్ నిరంజన్ రెడ్డి వాదనలు పూర్తి చేశారు. పిటిషనర్‌పై కేసును రద్దు చేయాలని తాము కోరడం లేదని, దర్యాప్తునకు పూర్తి సహ కారం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని, అరెస్టు చేయకుండా పిటిషనర్‌కు రక్షణ కల్పిం చాలని మాత్రమే కోరుతున్నామని చెప్పారు. ఎఫ్‌ఐఆర్‌లో తొలుత నమోదు చేసిన సెక్షన్లు ఏడేళ్లలోపు శిక్షకు సంబంధించినవేనని, అనం తరం కొత్త సెక్షన్లు చేర్చి కేసును తీవ్రతరం చేశారని ఆరోపించారు.
సుప్రీంకోర్టు ఇచ్చిన అర్నేష్ కుమార్ తీర్పు ప్రకారం ఏడేళ్లలోపు శిక్ష ఉన్న కేసుల్లో అరెస్టు చేయరాదని గుర్తుచేశారు. బాధితురాలి వయసుపై కూడా అనేక సందేహా లు ఉన్నాయన్నారు. ఒక బెర్త్ డాక్యుమెంట్‌లో 2008గా, మరో పత్రంలో 2010గా నమోదు ఉందన్నారు. అలాగే 2021లో నిర్మల్‌లో నమో దైన డ్రైవింగ్ కేసులో బాధితురాలి వయసు 15 ఏళ్లుగా నమోదు చేశారని, దీని ప్రకారం ఆమె వయసు 19–20 ఏళ్లు మధ్య ఉంటుంద న్నారు. ఆమె మేజర్ అయ్యే అవకాశాలున్నా యని పేర్కొన్నారు. ఒకవేళ ఆమె మైనర్ అయినప్పటికీ, సంఘటన జరిగినట్లు చెబుతున్న తేదీ నుంచి నాలుగు నెలల తర్వాత మాత్రమే ఫిర్యాదు చేయడాన్ని తీవ్రంగా పరిగణించాలని కోరారు. బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదులో భగీరథ్, బాధితురాలు రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు ప్రస్తావించారని చెప్పారు. గత ఏడాది జూన్‌లో పరిచయం ప్రారంభమై, డిసెంబర్ చివరిలో విభేదాలు వచ్చినట్లు ఫిర్యాదులో ఉందన్నారు. అయితే జనవరి 1న సంఘటన జరిగిందని చెబుతూ మే 8 వరకు ఫిర్యాదు చేయకపోవడం అనుమానాలకు తావిస్తోందని వాదించారు. కేసు తీవ్రతను తగ్గించి చూపడం లేదనీ, కానీ నిందితుడి హక్కులను కూడా కోర్టు రక్షించాల్సిన బాధ్యత ఉందన్నారు. కేసు మెరిట్స్‌లోకి వెళ్ల కుండా, అరెస్టు నుంచి మాత్రమే రక్షణ కోరుతు న్నామని స్పష్టం చేశారు.
దర్యాప్తుకు హాజరైన వెంటనే పోలీసులు కస్టడీలోకి తీసుకునే అవకాశ ముందని, అందువల్ల మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోర్టును అభ్యర్థించారు. విచారణ సందర్భంగా న్యాయమూర్తి, తొలుత నమోదు చేసిన సెక్షన్లలో తర్వాత మార్పులు ఎందుకు చేశారో పోలీసులను ప్రశ్నిం చారు. దీనిపై పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వర్ రావు స్పందిస్తూ, బాధితురాలి 161 స్టేట్‌మెంట్ నమోదు చేసిన తర్వాతే కొత్త సెక్షన్లు చేర్చామని తెలిపారు. ఈ నెల 8న రాత్రి బాధితురాలి తల్లి ఫిర్యాదు ఇవ్వగా, మరుసటి రోజు బాధితురాలి వాంగ్మూలం నమోదు చేసిన అనంతరం కేసులో అభియోగాల్లో మార్పులు చేసినట్లు కోర్టుకు వివ రించారు. బాధితురాలి తల్లి తరఫున సీనియర్ న్యాయవాది పప్పు నాగేశ్వర్‌రావు వాదిస్తూ, పోక్సో కేసుల్లో నిందితులకు రక్షణ కల్పించడా నికి అవకాశం లేదన్నారు. సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొ ంటున్న నిందితుడు అరెస్టు కావాల్సిందేనని తెలి పారు. కేంద్ర మంత్రి కుమారుడు కావడం వల్లే ఇప్పటివరకు అరెస్టు కాలేదని ఆరోపించారు. పేట్ బషీరాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి వెళ్లినప్పటికీ వెంటనే స్వీకరించ లేదని, అదే సమయంలో పిటిషనర్ కరీం నగర్ పోలీస్ స్టేషన్‌లో బాధితురాలిపై ఫిర్యాదు చేశా రని కోర్టుకు తెలిపారు. బాధితురాలు 2008లో పుట్టినా, 2010లో పుట్టినా మైనరేనని పేర్కొ ంటూ, పిటిషనర్ పరారీలో ఉన్నందున అత్య వసరంగా మధ్యంతర బెయిల్‌పై విచారణ చేపట్టాల్సిన అవసరం లేదన్నారు. కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం ఇవ్వాలని, విచారణను వాయిదా వేయాలని కోరారు.
ఇరుపక్షాలపై అసహనం
విచారణ సందర్భంగా ఇరువర్గాల న్యాయ వాదుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. బాధితురాలి తరఫు న్యాయవాది ”నేరస్తుడు”, ”జైలుకు వెళ్లాల్సిందే” అని వ్యాఖ్యానించడంపై పిటిషనర్ తరఫు న్యాయవాది నిరంజన్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆరోపణలు నిరూపితం కాకముందే నేరస్తుడిగా పేర్కొనడం చట్ట విరుద్ధమని అన్నారు. ఇప్పటికే కేంద్ర మంత్రి, పిటిషనర్ ఫొటోలతో పోస్టర్లు వెలిశా యని, విచారణ పూర్తికాకముందే నేరస్తుడిగా ముద్ర వేయడం సరికాదన్నారు. ఈ దశలో న్యాయమూర్తి జోక్యం చేసుకుని, ఇరుపక్షాలు సంయమనం పాటించాలని సూచించారు. వ్యక్తిగత ఆరోపణలు కొనసాగితే కేసును మరో న్యాయమూర్తికి బదిలీ చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. న్యాయవాదులు తమ కక్షిదారు ల తరఫున మాత్రమే వాదనలు వినిపించాలని, వ్యక్తిగత స్థాయికి తీసుకెళ్లవద్దని సూచించారు. అదేవిధంగా బాధితురాలి వయసుకు సంబం ధించిన పూర్తి వివరాలను సమర్పించాలని పోలీసులను ఆదేశించారు. 2021లో నమోదైన డ్రైవింగ్ కేసులో బాధితురాలి వయసు 15 ఏళ్లుగా నమోదు చేశారా లేదా అన్న అంశంపై స్పష్టత ఇవ్వాలని కోరారు. అలాగే బాధితురాలి జనన తేదీపై కూడా పూర్తి వివరాలు సమర్పిం చాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను శుక్ర వారానికి వాయిదా వేశారు.
భగీరథ్ మధ్యంతర బెయిల్‌పై నేడు హైకోర్టు నిర్ణయం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



