ఎమ్మెల్యే ఆది చొరవతో ఎల్లంపల్లి నుండి ఫాజుల్ నగర్ చెరువుకు నీరు విడుదల

నవతెలంగాణ – వేములవాడ రూరల్
ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చొరవతో యాసంగి సాగు అవసరాల నిమిత్తం ఎల్లంపల్లి నుండి వేములవాడ రూరల్ మండలం  ఫాజల్ నాగర్ చెరువుకి గత గురువారం నీటిని విడుదల చేశారు. గత కొన్ని రోజులుగా సాగు నీరు లేక రైతుల పొలాలు ఎండిపోవడంతో చందుర్తి, వేములవాడ మండల రైతులు విషయాన్ని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్   దృష్టికి తీసుకెళ్లారు, స్పందించిన స్థానిక ఎమ్మెల్యే మంత్రులతో, ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి నీటి విడుదలకు కృషి చేశారు. వ్యవసాయ సాగు నీరు విడుదలకు కృషిచేసిన స్థానిక ఎమ్మెల్యేకు కాంగ్రెస్ నాయకులు, రైతులు ధన్యవాదాలు తెలిపారు. శుక్రవారం రూరల్ మండల అధ్యక్షుడు వకులభరణం శ్రీనివాస్, మాజీ ఎంపీపీ రంగు వెంకటేశం గౌడ్, అధ్వర్యంలో ఫాజుల్ నగర్ చెరువు మైసమ్మ  వద్ద పూజలు నిర్వహించి నీటిని చందుర్తి, రుద్రంగి మండలాలకు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో రూరల్ మండల నూకలమర్రి యంపీటీసీ బొడ్డు రాములు శంకరమ్మ, బిసి సెల్ అద్యక్షులు వంగపెల్లి మల్లేశం,ఎసి సెల్ అద్యక్షులు రొండి రాజు, పాజుల్ నగర్ గ్రామ అద్యక్షులు కొండవేని తిరుపతి, వట్టెంల గ్రామ శాఖ అధ్యక్షులు గుడిసె శంకర్, తుర్కషి నగర్ గ్రామ అద్యక్షులు మోతి, వెంకటంపెల్లి మాజీ సర్పంచ్ బండ శ్రీనివాస్, చెక్కపెల్లి గ్రామ శాఖ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి,సంపత్ ,సురేష్ రేకబ్, తిరుపతి రెడ్డి,సోషల్ మీడియా కన్వీనర్ గుడిసె రాజేంద్ర ప్రసాద్, పొన్నం సత్యం గౌడ్, గట్టు కాశీగౌడ్, గడ్డం శేకర్, ఎం రెడ్డి తిరుపతిరెడ్డి, రమణ రెడ్డి,  అచ్చ వినోద్.ఉప్పరి పెద్దులు, కొట్టే గంగసాగర్, ప్రవీణ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love