
నవతెలంగాణ- తాడ్వాయి
ఈరోజు జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించి జిల్లా కలెక్టర్ కు తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మెమోరండం ఇచ్చిన అనంతరం సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకట గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో కల్లుగీత వృత్తిపై ఆధారపడి ఐదు లక్షల కుటుంబాలు ఉన్నాయని అలాంటి కుటుంబాలను రక్షించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉండాలి అందుకోసం కల్లుగీత వృత్తికి రక్షించాలని వృత్తి రక్షణకై సమగ్రమైన చట్టాలను రూపొందించాలని కేరళ రాష్ట్రంలో ఉన్న విధంగా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని దానికి ప్రతి సంవత్సరం 5000 కోట్లు బడ్జెట్ కేటాయించాలని అదేవిధంగా చిన్న తరహా పరిశ్రమలను ఏర్పాటు చేసి కల్లు ద్వారా ఉత్పత్తి అయ్యే వస్తువులను తయారు చేయించాలని దీనితో చదువుకున్న యువతీ యువకులకు ఉపాధి లభిస్తుందని రాష్ట్రంలో ఉన్న నందనం ప్రాజెక్టును వెంటనే ప్రారంభించాలని ప్రతి జిల్లాలో నీరా ప్రాజెక్టులను ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు లక్ష రూపాయల రుణం ఇవ్వాలని పథకం ప్రారంభించింది ఈ పథకంలో కల్లుగీత కార్మికులకు ఎలాంటి షరతులు లేకుండా లక్ష రూపాయలు మంజూరు చేయాలని కల్లు గీత కార్మికులకు బైకులు ఇవ్వాలని ప్రతి సొసైటీకి GO ప్రకారం 560 అమలు చేసి ఐదు ఎకరాల భూమిని చెట్లు పెంచుకోవడానికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కల్లు గీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు వెంకట గౌడ్ తో పాటు జిల్లా ఉపాధ్యక్షులు శంకర్ గౌడ్ జిల్లా కార్యదర్శి రాజు గౌడ్ నాయకులు రవి గౌడ్ రాజేశ్ గౌడ్ శ్రీధర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.