ప్లాస్టిక్ అనర్ధాల పట్ల ప్రజలు అవగాహన పెంచుకోవాలి

నవతెలంగాణ – గోవిందరావుపేట
ప్లాస్టిక్ వల్ల వచ్చే అనర్ధాల పట్ల ప్రజలు అవగాహన పెంచుకోవాలని డి ఆర్ డి ఓ నాగ పద్మజ అన్నారు. మంగళవారం మండలంలోని లక్నవరం పర్యాటక కేంద్రంలోప్రపంచ పర్యావరణ దినోత్సవం జూన్ 6 పురస్కరించుకొని పర్యాటకులతో కలిసి ప్లాస్టిక్ వలన వచ్చే అనర్థాలను ప్రజల్లో అవగాహన మరియు చైతన్యాన్ని తీసుకురావడం కోసం ర్యాలీ చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా డిఆర్డిఓ నాగపద్మజ మాట్లాడుతూ పలు అవగాహన కార్యక్రమాల ద్వారా ప్లాస్టిక్ వినియోగం పట్ల జరిగే అనర్ధాలను ప్రజలు చైతన్యం తీసుకురావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపిడి వెంకట నారాయణ ఎంపీడీవో సత్య ఆంజనేయ ప్రసాద్, ఎంపిఓ సాజిదా బేగం ఏపీవో ప్రసూన ఉపాధి హామీ సిబ్బంది ఐకెపి సిబ్బంది ప్రజలు ర్యాలీలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది .

Spread the love