కుటుంబ దాడిలో ఒకరు మృతి

నవతెలంగాణ – అశ్వారావుపేట
మద్యానికి బానిసైన భర్త భార్యపై దాడి చేస్తుండగా తండ్రిని నిలువరించే క్రమంలో కొడుకు చేసిన ప్రతి దాడిలో తండ్రి మృతి చెందాడు. మృతుని సమీప బంధువు పిర్యాదు మేరకు పోలీసుల హత్య కేసు నమోదు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి.నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేటకు చెందిన కోవా భద్రం (72) నిత్యం మద్యం సేవిస్తూ భార్య రాములమ్మ పై దాడి చేస్తూ శారీరకంగా వేదిస్తుంటాడు. భర్త వేదింపులు తట్టుకోలేక రాములమ్మ మండల పరిధిలోని ఆసుపాక లో ఉంటున్న తన కూతురు విజయలక్ష్మి ఇంటికి వెళ్ళింది.శుక్రవారం మధ్యాహ్నం అక్కడకు వెళ్ళిన భద్రం యథాప్రకారం భార్యపై దాడికి దిగాడు.కుమారుడు నరేష్అడ్డుకోబోయాడు. అయినా దాడి చేస్తుండటంతో భార్య రాములమ్మ,కుమారుడు నరేష్ కర్రలతో ప్రతి దాడి చేశారు.ఈ దాడిలో భద్రం తీవ్రంగా గాయపడ్డాడు.అదే సమయంలో కూతురు విజయలక్ష్మి ఉన్నారు. గాయపడిన భద్రం ను చికిత్స కోసం ఖమ్మం ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు.మృతదేహాన్ని కొవ్వూరులో దహనం చేసేందుకు తీసుకెళ్తుండగా  ఆంద్రప్రదేశ్ రాష్ట్రం ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం రౌతు గూడెం లో ఉంటున్న మృతుడి మేనల్లుడు గురుమూర్తి కి కుటుంబ సభ్యులు సమాచారం ఇచ్చారు.తాను కూడా మృతదేహాన్ని చూస్తాను అంటూ అశ్వారావుపేట తీసుకుని రమ్మన్నాడు. అశ్వారావుపేట మృతదేహం వచ్చిన తర్వాత పరిశీలించగా గాయాలు ఉన్నాయి.వెంటనే అనుమానం వచ్చి స్థానిక పోలీస్ స్టేషన్ లో శనివారం పిర్యాదు చేశాడు.ప్రాథమిక విచారణలో ప్రతి దాడిలో భద్రం మృతి చెందినట్లు నిర్ధారణ కావటంతో హత్య కేసు నమోదు చేసినట్లు ఎస్.హెచ్.ఒ ఎస్సై శ్రీకాంత్ తెలిపారు.భార్య రాములమ్మ,కుమారుడు నరేష్ తో పాటు కుమార్తె విజయలక్ష్మీ పై కేసు నమోదు నట్లు వివరించారు.ఇంచార్జి సీఐ పెద్దన కుమార్ దర్యాప్తు నిర్వహిస్తున్నారు.
Spread the love