కార్ బైక్ ఢీకొని ఒకరికి తీవ్ర గాయాలు

Oplus_0

నవతెలంగాణ – శంకరపట్నం
కారు బైకు ఢీకొని ఒకరికి తీవ్ర గాయాలైన ఘటన  వివరాల్లోకి వెళ్తే శంకరపట్నం మండల పరిధిలోని ఆముదాలపల్లి గ్రామానికి చెందిన, పుట్టపాక సమ్మయ్య(47)తన వ్యక్తిగత అవసరాల నిమిత్తం గురువారం బయటికి వెళ్లి వస్తుండగా అంబేద్కర్ భవనం దగ్గర కారు ఢీకొట్టడంతో సమ్మయ్య తలకు బలమైన గాయం తగిలి రోడ్డు మీద పడ్డాడు. అది చూసిన స్థానికులు 108 కు ఫోన్ చేయడంతో సిబ్బంది ఈఎంటి  సతీష్ రెడ్డి, పైలెట్ కాజా ఖలీల్,ఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రుని అంబులెన్స్ లోనికి తీసుకొని ప్రథమ చికిత్స అందిస్తూ, కరీంనగర్ ప్రభుత్వ  హాస్పిటల్ కు తరలించినట్లు,సిబ్బంది తెలిపారు.

Spread the love