పంచాయతీకి ఒకే ఒక కార్మికుడు ఘన సన్మానం

నవతెలంగాణ – రెంజల్

రెంజల్ మండలం వీరన్న గుట్ట తండా గ్రామపంచాయతీకి ఒకే ఒక్క పారిశుద్ధ కార్మికుడు అన్ని పనులను తానే నిర్వహిస్తూ ఒకే ఒక్కడిగా మంచి పేరు తెచ్చుకున్నాడని, గ్రామ కార్యదర్శి వెంకటరమణ పేర్కొన్నారు. పోతయ్య అనే పారిశుధ్య కార్మికుడు మురికి కాలువలను శుభ్రపరచడం, మొదలుకొని అన్ని పనులను నావే అన్న శ్రద్ధతో పనులు చేస్తూ ఉంటారని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్ జాదవ్ గణేష్ నాయక్, గ్రామ కార్యదర్శి వెంకటరమణ, హుస్సేన్ ,రామ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love