పంచాయతీ సిబ్బంది సమస్యలు పరిష్కరించాలి

– సీఐటీయూ  జిల్లా ఉపాధ్యక్షులు మ్యాదరి గంగాధర్
నవతెలంగాణ – డిచ్ పల్లి
గ్రామ పంచాయతీ సిబ్బందికి వేతనాల పెంపు, పర్మినెంట్, ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు, మల్టీపర్పస్ వర్కర్ విధానం రద్దు, కారోబార్, బిల్ కలెక్టర్లను సహాయ కార్యదర్శులుగా నియమించుట, పిఎఫ్, ఈఎస్ఐ, ప్రమాద బీమా, ఇన్సూరెన్స్ తదితర సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళగలరని కోరుతూ గురువారం ఇందల్ వాయి మండల కేంద్రంలోని మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం లో సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు మ్యాదరి గంగాధర్ అద్వర్యంలో అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 12,769 గ్రామ పంచాయితీలలో ప్రభుత్వ లెక్కల ప్రకారం 52,000 మంది గ్రామ పంచాయితీ ఉద్యోగులు, కార్మికులు పని చేస్తున్నారు. గ్రామాలలో పారిశుద్ధ్యం, మంచినీటి సరఫరా, వీరి టైల్స్, డంపింగ్ యాప్స్, హరితహారం, పల్లె పకృతి వనాలు, వైకుంఠ ధామాలు తదితరి సుల్లో నిత్యం శ్రమిస్తూ గ్రామీణ ప్రాంతాలలో ఎలాంటి అంటువ్యాధులు, అనారోగ్యాలు రాకుండా ప్రజలకు సేవలందిస్తున్నారు. వీరిలో అత్యధికులు దళితులు, బలహీన వర్గాలకు చెందిన పేద కార్మికులు, సంవత్సరాల తరబడి విధులు నిర్వహిస్తున్నా నేటికీ పర్మినెంట్కు నోచుకోలేదు. అతి తక్కువ వేతనాలకు పనులు చేస్తున్నారు. గ్రామ పంచాయతీలలో ప్రజల అవసరాల మేరకు అదనంగా కార్మికులను నియమించి వారికి కనీస వేతనాలు ఇప్పకుండా, మొత్తం పాత కార్మికుల జీతాలను అదనపు కార్మికులకు పంచి ఇవ్వడంతో నెలకు రూ.3,500/-ల నుండి రూ.4,000/-లు మాత్రమే పంచాయితీ కార్మికునికి నెల వేతనం వస్తుందని,ఈ వేతనాలు కూడా నెలల తరబడి ఇవ్వకపోవడంతో అర్ధాకలితో, అప్పులు చేసుకుని బతకాల్సిన పరిస్థితుల్లో పంచాయితీ కార్మికులున్నారని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో గ్రామ పంచాయితీ సిబ్బంది సమస్యలు పరిష్కరించాలని 34 రోజుల పాటు ఆందోళన – పోరాబాలు సాగించినప్పటికీ సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదు. గ్రామ పంచాయితీ సిబ్బందికీ రూ.5 లక్షల ఇన్సూరెన్స్, దహన సంస్కారాలకు రూ.10,000/-లు ఇస్తామని సర్యులర్ జారీ చేసి ఈ స్కీమ్ విధి విధానాలు ప్రకటించకుండా, అమలు చేయకుండా మోసం చేశారని దుయ్యబట్టారు.తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజల, ఉద్యోగులు, కార్మికుల ఆకాంక్షల మేరకు నూతన ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం ప్రజల, ఉద్యోగుల, కార్మికుల సమస్యలను సత్వరమే పరిష్కరిస్తారని గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ & వర్కర్స్ యూనియన్ సీఐటీయూ) ఆశిస్తూందని వివరించారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు తమ సేవలందించిన గ్రామ పంచాయితీ సిబ్బందికి ఎన్నికల్లో, మేనిఫెస్టోలో పొందుపర్చిన విదంగా కార్మికులందరిని పర్మినెంట్ చేయాలని, కనీస వేతనాలు అమలు చేయాలని, కారోబార్, బిల్ కలెక్టర్లు, గుమస్తాలను సహాయ కార్యదర్శులుగా నియమిస్తామనే హామీల అమలుకు సత్వరమే చర్యలు తీసుకోగలరని, ఆలోపు ఇతర శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, సిబ్బందికి జీఓ నెం.60 ప్రకారం వేతనాలు చెల్లించినట్లుగా మాకు కూడా వేతనాలు పెంచాలని, మల్టీపర్పస్ వర్కర్ విధానం రద్దు చేసి, పాత భేటగిరీలను పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేస్తూ తెలంగాణ గ్రామీణ పారిశుద్ధ్య నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి సహకారాన్ని అందజేస్తామని వివరించారు.ఈ కార్యక్రమం లో సీఐటీయూ మండల అధ్యక్షులు అశోక్,పి.గంగారాం మలయ్య రాజ నర్సయ్య, నాగేష్, భూపతి తోపాటు తదితరులు పాల్గొన్నారు.
Spread the love