ఉమ్మడి జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించిన నాయకుడు షబ్బీర్ అలీ..

నవతెలంగాణ – డిచ్ పల్లి
తెలంగాణ యూనివర్సిటీలో ఎస్సీ, ఎస్టీ, బిసీ, మైనార్టీ శాఖల ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ జన్మదినం సందర్భంగా తెలంగాణ యూనివర్సిటీ పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు పంచరెడ్డి  చరణ్ ఆధ్వర్యంలో  జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా  పంచరెడ్డి  చరణ్ మాట్లాడుతూ ఎన్ ఎస్ యు ఐ కార్యకర్తగా రాజకీయ జీవితం ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రజల గుండెల్లో ప్రియతమ నేతగా ముద్ర వేసుకున్న నాయకుడు షబ్బీర్ అలీ అన్నారు.గత 40 ఏళ్ళుగా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ పార్టీ అధికారంలో ఉన్న లేకపోయినా ఎల్లప్పుడు ప్రజాభివృద్ధే ద్యేయంగా పనిచేశారని, అతి చిన్న వయసులో ఎమ్మెల్యేగా, ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా ,ప్రత్యేక రాష్ట్రంలో ఎమ్మెల్సీగా శాసనమండలి ప్రతిపక్ష నేతగా ఆయన విధులు సమర్థవంతంగా నిర్వర్తించారని ఆయన అన్నారు. ఏ పదవి చేపట్టిన ఆ పదవికే వన్నెతెచ్చిన వ్యక్తి అని,గతంలో వైఎస్సార్  క్యాబినెట్ లో సభ్యునిగా, షబ్బీర్ అలీ  సమాచార & ప్రజా సంబంధాలు, ఇంధనం, బొగ్గు, మైనారిటీల సంక్షేమం, వక్ఫ్ & ఉర్దూ అకాడమీ, ఎన్అర్ఐ వ్యవహారాల ముఖ్యమైన శాఖలను సమర్థవంతంగా నిర్వర్తించారో ప్రస్తుతం బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ శాఖల ప్రభుత్వ సలహాదారులుగా కూడా ఆయన అనుభవం ఆలోచన విధానంతో గొప్ప నిర్ణయాలు తీసుకొని  భవిష్యత్తులో ఆయా వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడతారని ఆయన అన్నారు . ఈ కార్యక్రమంలో ఆర్మూర్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు బైండ్ల ప్రశాంత్ నరన్ దీప్, రమేష్,అఖిల్, శివ నరేష్  తదితరులు పాల్గొన్నారు.
Spread the love