పోస్టు ఒక్కటే…జీతాలే వేర్వేరు

only-the-salary-is-different-for-the-post– మిడ్‌ లెవల్‌ హెల్త్‌ ప్రొవైడర్ల వేతనాల్లో వ్యత్యాసం
– నర్సింగ్‌ ఆఫీసర్లకు తక్కువ చెల్లింపులెందుకు?
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
సాధారణంగా ఒకే రకమైన పోస్టులకు ఒకే రకమైన వేతనాలను నిర్ణయిస్తారు. వేతనాల్లో వ్యత్యాసం చూపిస్తుం డటంతో నర్సింగ్‌ ఆఫీసర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ పరిధిలో ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా మిడ్‌ లెవల్‌ హెల్త్‌ ప్రొవైడర్‌ (ఎంఎల్‌హెచ్‌పీ) పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టారు. ఒక్కో జిల్లాలో అవసరాన్ని బట్టి 15 నుంచి 20 మంది చొప్పున రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 300 నుంచి 500 వరకు పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇప్పటికే జిల్లాల వారీగా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ ఇచ్చారు. ఈ పోస్టులన్నీ కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన భర్తీ చేసేవే. ఆంధ్రప్రదేశ్‌ లో ఈ పోస్టులకు కేవలం బీ.యస్సీ (నర్సింగ్‌ ) అర్హత కలిగి న వారిని తీసుకుంటున్నారు. కర్ణాటకలో బీ.యస్సీ (నర్సింగ్‌) తో పాటు జీఎన్‌ఎం అర్హత కలిగిన వారితో నింపుతున్నారు. తెలంగాణలో మాత్రం ఎంబీబీఎస్‌, బీఏఎంఎస్‌ చదివిన వారికి కూడా అవకాశమిచ్చారు. రాష్ట్రంలో నర్సింగ్‌ విద్యను అభ్యసించిన వారి సంఖ్య భారీగా ఉన్నది. మరోవైపు గ్రామా ల్లో శాస్త్రీయ వైద్యం అందుబాటులో లేక ప్రజలు నకిలీలు, అశాస్త్రీయ వైద్య విధానాల వైపు వెళుతూ ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఎంఎల్‌హెచ్‌పీలను నియామకం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలందించాలని దేశవ్యాప్తంగా మిడ్‌ లెవల్‌ హెల్త్‌ ప్రొవైడర్లను పరిచయం చేస్తున్నారు. ప్రాథమిక వైద్యాన్ని మరింత బలోపేతం చేసే క్రమంలో పెద్దాస్పత్రులపై భారం పడకుండా వారు కీలక పాత్ర పోషిస్తారని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి పోస్టు లను భర్తీ చేసే క్రమంలో నిర్ణయించిన జీతాల్లో తేడా ఉండ టం నర్సింగ్‌ ఆఫీసర్లను అసంతృప్తికి గురి చేస్తున్నది.ఎంబీబీ ఎస్‌, బీఏఎంఎస్‌ అభ్యర్థులకు రూ.40 వేలుగా, స్టాఫ్‌ నర్సు లకు వేతనం రూ.29,900గా నిర్ణయించడమే ఇందుకు కార ణం. ఎంఎల్‌హెచ్‌పీగా ఎంపికైన స్టాఫ్‌ నర్సులకు ఏపీలో రూ.25 వేల జీతంతో పాటు రూ.15 వేలు ఇన్సెంటివ్‌గా మొత్తం రూ.40 వేలిస్తుండగా, తెలంగాణలో రూ.29,900 గా నిర్ణయించడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచించి ఎంబీబీఎస్‌, బీఏఎం ఎస్‌ అభ్యర్థు లకిచ్చినట్టుగానే సమాన వేతనం ఇవ్వాలని కోరుతున్నారు.
మొదటి ప్రాధాన్యతనివ్వాలి
ఎంహెల్‌ హెచ్‌ పీ పోస్టుల భర్తీలో బీ.యస్సీ (నర్సింగ్‌), జీఎన్‌ఎం అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యతని వ్వాలని తెలంగాణ నర్సింగ్‌ సమితి (టీఎన్‌ఎస్‌) రాష్ట్ర అధ్యక్షులు కంపాటి ధనుంజరు డిమాండ్‌ చేశారు. బ్రిడ్జ్‌ కోర్సుతో సంబంధం లేకుండా అర్హత కల్పిస్తూ నియామకాలు చేపట్టాలని కోరారు. ఒకే రకమైన పోస్టుకు ఒకే విధంగా వేతనాన్ని నిర్ణయించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. లేదంటే భవిష్యత్‌ కార్యాచరణ చేపట్టాల్సి వస్తుందని ధనంజరు హెచ్చరించారు.
టీఎన్‌ఎస్‌ అధ్యక్షులు కాంపాటి ధనుంజయ్

Spread the love