గాయం కాలుకి, ఆపరేషన్ ప్రయివేటు పార్ట్ కు..

నవతెలంగాణ – మహారాష్ట్ర: జిల్లాలోని షాహాపూర్‌కు చెందిన తొమ్మిదేళ్ల బాలుడి కాలుకు గాయం కావాడంతో అతని తలిదండ్రులు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయతే ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు బాబు కాలుకు బదులుగా అతని ప్రయివేటు పార్ట్‌కు శస్త్రచికిత్స చేశారని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై బాలుడి తల్లిదండ్రులు మాట్లాడుతూ..“గత నెలలో తన స్నేహితులతో ఆడుకుంటున్న సమయంలో బాబు కాలికి గాయమైంది. జూన్ 15న షాహాపూర్‌లోని జిల్లా ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నాడు. గాయపడిన కాలుకు బదులుగా అతని ప్రైవేట్ పార్ట్‌కు వైద్యులు ఇటీవల శస్త్రచికిత్స చేశారని ఆరోపించారు. అయితే దీనిపై ఎటువంటి కేసు నమోదు కాకపోయినప్పటీకీ.. జిల్లా సివిల్ సర్జన్ డాక్టర్ కైలాస్ పవార్ ఆరోపణలపై ఆరోగ్య అధికారులు విచారణ జరుపుతారని తెలిపారు. ఆసుపత్రి వైద్యాధికారి గజేంద్ర పవార్ విలేఖరులతో మాట్లాడుతూ.. బాలుడికి కాలికి గాయం కాకుండా, ఫిమోసిస్ (ప్రైవేటు పార్ట్ కి సంబంధించిన) సమస్య కూడా ఉందని తెలిపారు. అందువల్ల మేము రెండు ఆపరేషన్లు చేయవలసి వచ్చింది”అని వివరించారు. అయితే  వైద్యులు ఇచ్చిన వివరణను తల్లిదండ్రులు అంగీకరించడం లేదు.

Spread the love