రైతులను ఆందోళనకు గురి చేస్తున్నాయి ొ వరుస ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను ఓడిస్తున్నా నేర్వని గుణపాఠం ొ అన్నదాతలకు ఏ ఇబ్బంది వచ్చినా కంట్రోల్ రూమ్‌కు తెలియజేయండి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ధాన్యం కొనుగోళ్ల అంశంపై విపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను అయోమయంలో పడేసేందుకు ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారానికి పాల్పడుతున్నాయని విమర్శించారు. వరుసగా జరిగిన ఎన్నికల్లో ప్రజలు బీఆర్‌ఎస్‌ను తిరస్కరించినా గుణపాఠం నేర్వలేదని చెప్పారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా సివిల్ సప్లరు కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేయాలని సూచించారు. రైతులు రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల్లో నిరీక్ష?ించకుండా టోకెన్లు జారీ చేస్తామనీ, ఆ సమయానికి ఆ రైతులు వస్తే సరిపోతుందని అన్నారు. బుధవారం హైదరాబాద్‌లోని బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో మంత్రి విలేకర్లతో మాట్లాడారు.
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే రాష్ట్రంలో రికార్డ్ స్థాయిలో ధాన్యం కొనుగోలు చేశామన్నారు. దిగుబడిపై కూడా బీఆర్‌ఎస్ అసత్య ప్రచారానికి పాల్పడుతోందన్నారు. శాసనసభ, లోక్‌సభ, సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పిన గులాబీ నేతలకు కనువిప్పు కలగలేదని విమర్శించారు. రాష్ట్రంలోనే ఈ రబీ సీజన్ లో 67 లక్షల ఎకరాల్లో వరి సాగైందనీ, దాదాపు 141 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి రానుందని తెలిపారు. 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం సన్నద్ధమవుతున్నదని చెప్పారు. ఇప్పటి వరకు ప్రభుత్వం 17.28 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసిందని తెలిపారు. అందుకు రైతులకు మొత్తం రూ. 2,310 కోట్లు చెల్లించామని చెప్పారు. రబీ సీజన్లో ధాన్యం కొనుగోలుకు గానూ రూ. 21 వేల కోట్లు కేటాయించినట్టు గుర్తు చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మౌలిక సదుపాయాలపై బీఆర్‌ఎస్ తప్పుడు ప్రచారం చేస్తున్నదని విమర్శించారు. అకాల వర్షాలు సంభవిస్తే ధాన్యం తడిసి పోకుంటా ఉండేందుకు 2.63 లక్షల టార్బాలిన్లు తెప్పించామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 8,575 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. 18.75 కోట్ల గన్నీ బ్యాగులు అందుబాటులో ఉంచామన్నారు. 64.83 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వ చేసే సామర్ధ్యం ఉందనీ, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. అదనంగా 11.20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వ చేసేందుకు గోదాములను గుర్తించామని చెప్పారు.
కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించేందుకు 6,200 వాహనాలను సిద్ధంగా ఉన్నాయన్నారు. రైతులకు దాహార్తి తీర్చేందుకు వీలుగా మంచినీటి సరఫరా, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు సరఫరా చేస్తున్నట్టు తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులు చనిపోతే తక్షణమే పరిహారం ఇస్తామన్నారు. ఎండలు ఎక్కువగా ఉండటంతో ఉదయం, సాయంత్రం పూట ధాన్యం కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించినట్టు తెలిపారు. అకాల వర్షాలు సంభవిస్తే రైతులు, సిబ్బంది చెట్ల కింద, కరెంట్ స్తంభాల దగ్గర ఉంటే పిడుగుపాటుకు గురి కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఎప్పటికప్పుడు రాష్ట్ర స్థాయి నోడల్ అధికారి పర్యవేక్షణ చేయాలని సూచించారు. వాతావరణంలో సంభవిస్తున్న మార్పులపై కొనుగోలు కేంద్రాలకు ఎప్పటికప్పుడు సమాచారం అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు.
90 లక్షల మెట్రిక్ టన్నుల
ధాన్యం కొనుగోలు లక్ష్యం
2023-24 బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఖరీఫ్ లో 47.34 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 2024-25 ఖరీఫ్ లో 53.95 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్టు మంత్రి ఉత్తమ్ తెలిపారు. 2023-24 బీఆర్‌ఎస్ పాలనలో నాటి ప్రభుత్వం ఖరీఫ్ లో కొనుగోలు చేసిన ధాన్యానికి రూ. 10,415 కోట్లు చెల్లిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 2024-25 ఖరీఫ్ లో రూ. 12,512 కోట్లు చెల్లించామని వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2023-24 రబీలో 7,178 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 7.62 లక్ష?ల మంది రైతుల నుంచి 47.97 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామన్నారు. అదేవిధంగా రైతులకు రూ. 10,549 కోట్లు చెల్లించినట్టు తెలిపారు.
2024-25 రబీలో 8,378 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 10.87 లక్ష?ల మంది రైతుల నుంచి 74.21 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామన్నారు. రైతులకు రూ. 17,198 కోట్లు చెల్లించామని తెలిపారు. 2025-26 ఖరీఫ్ లో 8,448 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 11.65 లక్ష?ల మంది రైతుల నుంచి 71.86 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామన్నారు. రైతుల ఖాతాల్లో రూ. 17,160 కోట్లు వేసినట్టు తెలిపారు. ప్రస్తుత రబీలో 8,575 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 13 లక్షల మంది రైతుల నుంచి రికార్డ్ స్థాయిలో 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యాన్ని పెట్టుకుని రూ. 21,501 కోట్లు రైతులకు చెల్లించేందుకు ప్రభుత్వం సన్నద్ధంగా ఉందని చెప్పారు. ఇలాంటి సమయంలో బీఆర్‌ఎస్ తప్పుడు సమాచారంతో రైతాంగాన్ని గందరగోళ పరుస్తుందని చెప్పారు. రైతులకు నష్టం కలిగించే ఎలాంటి చర్యనూ కాంగ్రెస్ ప్రభుత్వం సమర్థించబోదని ఆయన హెచ్చరించారు.
ధాన్యం కొనుగోళ్లపై విపక్షాల దుష్ప్రచారం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



