నవతెలంగాణ – ఆర్మూర్
అమ్మతనం మాతృ ప్రేమ ఎంత స్వచ్ఛంగా ఉంటాయో, అలాంటిదే మాతృభాష అని మండలంలోని గోవింద్ పెట్ ప్రాథమిక పాఠశాల ప్రధా నో పాధ్యాయురాలు శ్రీమతి మాడవేడి పద్మావతి మంగళవారం తెలిపారు. రేపు ప్రపంచ మాతృభాష దినోత్సవాన్ని పురస్కరించుకొని మాట్లాడుతూ.. మంచి ఫలితాలు సాధించాలంటే తల్లి భాషలోనే సాధ్యమని, ఈ విషయాన్ని అందరూ తెలుసుకొని అమలు కోసం కృషి చేయాలని, స్వచ్ఛమైన తెలుగు భాష కనుమరుగు కాకుండా చూడాలని అన్నారు.