నేషనల్ ఇంటర్ డిస్ట్రిక్ట్ సబ్ జూనియర్ అథ్లెటిక్స్ కు ఎంపికైన ఆక్స్ ఫర్డ్ విద్యార్థి


నవతెలంగాణ కంటేశ్వర్: నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆక్స్ఫర్డ్ పాఠశాలకు చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థి అబ్దుల్ అల్యాఫీ నేషనల్ ఇంటర్ డిస్టిక్ సబ్ జూనియర్ అథ్లెటిక్స్ అసోసియేషన్ 2023 -24 లో నిర్వహించిన పోటీలలో భాగంగా జావలిన్ త్రో విభాగంలో పోటీ చేసి సిల్వర్ మెడల్ సాధించిన విద్యార్థి ని పాఠశాల యాజమాన్యం మామిడాల మోహన్ అభినందించారు. ఈ మేరకు ఆదివారం పాఠశాల ఆవరణంలో ఘనంగా సన్మానించి నేషనల్ లెవెల్ లో అథ్లెటిక్స్ విభాగంలోని జావిలిన్ త్రోకు సెలెక్ట్ అయినందుకు అభినందిస్తూ కృతజ్ఞతలు తెలియజేశారు. పాఠశాల తో పాటు నిజామాబాద్ జిల్లా, తల్లిదండ్రులకు సైతం గుర్తింపు తీసుకువస్తానని అల్యాఫీ మాట ఇచ్చారు.

Spread the love