ప్రభాకర్ రెడ్డి గెలుపు ఖాయం పిఎసిఎస్ చైర్మన్ లింగాల రాజలింగారెడ్డి

నవతెలంగాణ – మిరు దొడ్డి 

దుబ్బాక నియోజకవర్గం లో బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి గెలుపు ఖాయమని పిఎసిఎస్ చైర్మన్ లింగాల రాజలింగారెడ్డి అన్నారు. శుక్రవారం మిరుదొడ్డి మండలంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి ప్రజలు ఓటు వేశారని అన్నారు. ప్రజలకు రైతులకు అండగా తెలంగాణ ప్రభుత్వం ఉందని అన్నారు. రైతులకు రైతుబంధు ,రైతు బీమా వంటి పథకాలను ప్రతి ఇంటింటికీ అందే విధంగా అందిస్తున్న నాయకుడు కేసీఆర్ అని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని అన్నారు. దుబ్బాక నియోజకవర్గం లో మరింత అభివృద్ధి చెందడానికి కొత్త ప్రభాకర్ రెడ్డి అందుబాటులో ఉన్నాడని అన్నారు.

Spread the love