కాంగ్రెస్‌ గూటికి పీఎసీఎస్‌ చైర్మన్‌

మహమ్మదాబాద్‌: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ రెవెన్యూ మంత్రి స్వర్గీ య కమతం రాంరెడ్డి తనయుడు మాజీ రంగారెడ్డి జిల్లా డీసీసీబీ చైర్మన్‌, పరిగి మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌, ఉమ్మడి గండీడ్‌ మండల ప్రస్తుత పీఎసీఎస్‌ చైర్మన్‌ కమతం శ్రీనివాస్‌ రెడ్డి గురువారం హైద రాబాద్‌ లోని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి నివాసంలో కాంగ్రెస్‌ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్‌ సొంత గూటికి చేరడం ఎంతో ఆనందంగా ఉందని, కేసీఆర్‌ను నమ్మి ప్రజలు మోసపోయారని, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమనీ అన్నారు. పరిగి నియోజకవర్గం కాంగ్రెస్‌ పార్టీ గెలుపునకు ప్రతి ఒక్కరూ కషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఉపాధ్యక్షులు వేంనరేందర్‌ పరిగి మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Spread the love