వరి నాటు వేసిన పొలాలను కాపాడాలి…

– తక్షణమే నీటిని విడుదల చేయాలి…
– కౌలు రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి అన్నెం పాపి రెడ్డి
నవతెలంగాణ కోదాడరూరల్
నాగార్జునసాగర్ కెనాల్ కింద బోర్లు, బావుల కింద వరి నాటు వేసిన పొలాలు ఎండిపోతున్నాయని తక్షణమే ఆ పొలాలకు నీటిని విడుదల చేయాలని కౌలు రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి అన్నెం పాపిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం కోదాడ, హుజూర్నగర్ నియోజక వర్గాలలోఎండిపోతున్న వరి పొలాలను పరిశీలించి మాట్లాడారు. గత నెలలో కృష్ణ బేసిన్ లో వర్షాలు కురవడంతో ప్రాజెక్టులకు నీళ్లు రావడంతో రైతాంగం నాగార్జునసాగర్ ఆయకట్టు ఎడమ కాలువ కింద మిర్యాలగూడ, హుజూర్నగర్, కోదాడ నియోజవర్గ రైతులు దాదాపుగా వరి నాట్లు పూర్తి చేశారు. నాట్లు వేసి నెల అవుతుంది నెల రోజుల నుండి వర్షాలు లేక బోర్లు, బావులలో నీరు అడుగంటి పోవడంతో దిక్కుతోచని స్థితిలో రైతాంగం ఉన్నారు. బావులు పూర్తిగా ఎండిపోయినాయి బోర్లలో చాలీచాలని నీరుతో పంట పొలాలు నెర్రెలు పారి ఎండి పోయోదశిలో ఉన్నవి కావున ఎడమ కాలువ పరిధిలో రైతులకు తక్షణమే నీటిని విడుదల చేసి రైతులు నష్టపోకుండా చూడాలని కౌలు రైతు సంఘం పక్షాన డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యేలతో దృష్టికి తీసుకెళ్లిన్నట్టు తెలిపారు. ఎమ్మెల్యే మంత్రి దృష్టికి తీసుకెళ్లి నీటి విడుదలపై చర్చిస్తామని హామీ ఇచ్చారు. తక్షణమే నీటిని విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు అమరబోయిన ఎలమంద, భిక్షమారెడ్డి, వెంకట్ రెడ్డి, సైదిరెడ్డి, వెంకటరెడ్డి, రాములు, రాంరెడ్డి, తదితర రైతులు పాల్గొన్నారు.

Spread the love