పాకిస్థాన్‌ ఢమాల్‌

Pakistan Dhamaal– కివీస్‌ చేతిలో 91 పరుగులకే ఆలౌట్‌
క్రైస్ట్‌చర్చ్‌ (న్యూజిలాండ్‌): పాకిస్థాన్‌ పేలవ ఫామ్‌ కొనసాగుతుంది. న్యూజిలాండ్‌తో తొలి టీ20లో ఆ జట్టు 91 పరుగులకే కుప్పకూలింది. బాబర్‌, రిజ్వాన్‌ లేని జట్టు 18.4 ఓవర్లలో 91 పరుగులకు ఆలౌటైంది. ఖుష్దిల్‌ షా (32, 30 బంతుల్లో 3 సిక్స్‌లు), సల్మాన్‌ ఆఘా (18, 20 బంతుల్లో 2 ఫోర్లు), జహందాద్‌ ఖాన్‌ (17, 17 బంతుల్లో 1 సిక్స్‌) ఫర్వాలేదనిపించినా.. పాక్‌ను మూడంకెల స్కోరు దాటించలేకపోయారు. కివీస్‌ పేసర్లు జెమీసన్‌ (3/8), జాకబ్‌ డఫ్ఫీ (4/14) సహా స్పిన్నర్‌ ఇశ్‌ సోధి (2/27) పాక్‌ పతనాన్ని శాసించారు. స్వల్ప లక్ష్యాన్ని న్యూజిలాండ్‌ 10.1 ఓవర్లలోనే ఊదేసింది. టిమ్‌ సీఫర్ట్‌ (44, 29 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌), ఫిన్‌ అలెన్‌ (29 నాటౌట్‌, 17 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), టిమ్‌ రాబిన్సన్‌ (18 నాటౌట్‌) రాణించారు. జెమీసన్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా నిలువగా… ఐదు మ్యాచుల టీ20 సిరీస్‌లో ఆతిథ్య కివీస్‌ 1-0 ఆధిక్యం సాధించింది.

Spread the love