– సీఐటీయూ జిల్లా నాయకులు గుమ్మడి కురుమయ్య
– కడ్తాల్ లో సమ్మె, నిరాహార దీక్షలు ప్రారంభించిన జీపీ కార్మికులు
నవతెలంగాణ-ఆమనగల్
దశాబ్దాల కాలంగా పనిచేస్తున్న గ్రామ పంచాయతీ కార్మికులను ప్రభుత్వం వెంటనే పర్మినెంట్ చేయాలని సీఐటీయూ జిల్లా నాయకులు గుమ్మడి కురుమయ్య డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో గురువారం కడ్తాల్ మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ కార్మికులు సమ్మె చేపట్టారు. ఈ సందర్భంగా స్థానిక బస్టాండ్ ఆవరణలో ఏర్పాటు చేసిన నిరహార దీక్షా శిబిరాన్ని సీఐటీయూ జిల్లా నాయకులు గుమ్మడి కురుమయ్య సందర్శించి మాట్లాడారు. పంచాయతీ కార్మికులను దశాబ్దాల కాలంగా పనిచేస్తున్న గ్రామ పంచాయతీ కార్మికులను ప్రభుత్వం వెంటనే పర్మినెంట్ చేయాలని సీఐటీయూ జిల్లా నాయకులు గుమ్మడి కురుమయ్య డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలోపర్మినెంట్ చేసి ప్రత్యేక బడ్జెట్ ద్వారా నెల నెల వేతనాలను వారి వ్యక్తిగత ఖాతాల్లో జమ చేయాలని అన్నారు. పీఆర్‌సీలో నిర్ణయించిన ప్రకారం మినిమమ్ బేసిక్ రూ.19,000లకు తగ్గకుండా నెలసరి వేతనం ఇవ్వాలన్నారు. జీఓ నెంబర్ 51 ని సవరించి మల్టీ పర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేసి పాత కేటగిరీ విధానాన్ని అమలు చేయాలన్నారు. అదేవిధంగా పీఎఫ్, ఈఎస్‌ఐ, రూ.10 లక్షలు ప్రమాద భీమా సౌకర్యం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. పంచాయతీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే వరకు సమ్మె కొనసాగుతుందని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో జీపీ కార్మికుల సంఘం మండల అధ్యక్షురాలు వెంకటమ్మ, కోకన్వీనర్ ఆశీర్వాదం, సభ్యులు దశరథం, పరమేష్, అంజమ్మ, బాగ్యమ్మ, నరేష్, లక్ష్మమ్మ, చెన్నయ్య, కుమార్ తదితరులు పాల్గొన్నారు.