పిఠాపురం నియోజకవర్గంలో ఏదో ఒక ఊర్లో ఇల్లు తీసుకుంటాను: పవన్

నవతెలంగాణ – ఆంధ్రప్రదేశ్ : ఏపీ ఎన్నికల భాగంగా పిఠాపురం నియోజకవర్గంలో పర్యటిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆసక్తికర వాఖ్యలు చేశారు. పిఠాపురం నియోజకవర్గం నుంచి తనను, కాకినాడ పార్లమెంటు స్థానం నుంచి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ను గెలిపించాలని పవన్ విజ్ఞప్తి చేశారు. పిఠాపురం నియోజకవర్గం నుంచి తనను గెలిపిస్తే, దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా పిఠాపురంను తీర్చిదిద్దుతానని పేర్కొన్నారు. పిఠాపురం నియోజకవర్గ పరిధిలో 54 గ్రామాలు ఉన్నాయని, వాటిలో ఏదో ఒక ఊరిలో ఇల్లు తీసుకుంటానని వెల్లడించారు. పగిలేకొద్దీ పదునెక్కేది గ్లాసు..గ్లాసు గుర్తుకు ఓటేయండి, జనసేనను గెలిపించండి అని పిలుపునిచ్చారు. వైసీపీ ఫ్యాన్ కు సౌండ్ ఎక్కువ.. గాలి తక్కువ..అది ఓడిపోయే పార్టీ అని అన్నారు.

Spread the love