నవతెలంగాణ-కమ్మర్‌పల్లి: మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద ఆదివారం తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు, శాసనమండలి సభ్యుడు బి.మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకలను మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బోనగిరి భాస్కర్ కేక్ కట్ చేసి, కాంగ్రెస్ పార్టీ మండల శాఖ తరపున మహేష్ కుమార్ గౌడ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహేష్ కుమార్ గౌడ్ క్రమశిక్షణకు, విశ్వసనీయతకు మారుపేరు అన్నారు. పార్టీ అధికారంలో లేని సమయంలో కష్టకాలంలో కూడా పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉండి వారిలో మానసిక స్థైర్యాన్ని నింపి అధికారంలో రావడానికి ఎనలేని కృషి చేశారని పేర్కొన్నారు. ఆయన సూచనతో ముందుకు వెళ్లి పార్టి పటిష్ఠతకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని, ప్రజా పాలనలో భాగమై తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పాలేపు నర్సయ్య, మాజీ మండల అధ్యక్షుడు సుంకేట రవి, ఉప్లూర్ గ్రామ సర్పంచ్ ఏనుగందుల శైలేందర్, ఉప సర్పంచ్ తక్కురి శేఖర్, డీసీసీ ప్రధాన కార్యదర్శి మురళి, డీసీసీ నాయకులు తిప్పిరెడ్డి శ్రీనివాస్, తక్కురి దేవేందర్, బోనగిరి లక్ష్మణ్, బద్దం తిరుపతి రెడ్డి, సుంకరి విజయ్, బుచ్చి మల్లయ్య, కమ్మర్ పల్లి గ్రామ శాఖ అధ్యక్షుడు గణేష్ గౌడ్, సీనియర్ నాయకులు గంగారెడ్డి, నిమ్మ ప్రసాద్, వన్నెలా రాజేశ్వర్, శివసరం గణేష్, డాక్టర్ నరేష్, శైలేందర్, అజర్, సాధుల్లా, మొకిమ్, నజీర్, తదితరులు పాల్గొన్నారు.



