Monday, August 17, 2026
E-PAPER
Homeనల్లగొండరాజీవ్ స్మారక ట్రస్ట్ ఆధ్వర్యంలో మూడు కుటుంబాలకు ఆర్థిక సాయం

రాజీవ్ స్మారక ట్రస్ట్ ఆధ్వర్యంలో మూడు కుటుంబాలకు ఆర్థిక సాయం

- Advertisement -

నవతెలంగాణ-చౌటుప్పల్ రూరల్: రాజీవ్ స్మారక ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరుపేద కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేస్తున్నట్లు చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య తెలిపారు.ఆదివారం ఆయన మాట్లాడుతూ.. చౌటుప్పల్ మండలం నేలపట్ల గ్రామానికి చెందిన పాలమాకుల యాదయ్య, చౌటుప్పల్ మున్సిపాలిటీ తంగడపల్లికి చెందిన ఉదరి కిష్టయ్య, చౌటుప్పల్ పట్టణానికి చెందిన కేశవాచారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.15,000 చొప్పున ఆర్థిక సాయం అందించినట్లు వెల్లడించారు.ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ రావుల మాధవరెడ్డి సహకారంతో ఈ సాయం అందించామని,రాజీవ్ ట్రస్ట్ ఎల్లప్పుడూ పేదలకు అండగా నిలుస్తుందని ఉబ్బు వెంకటయ్య పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ట్రస్టు కార్యదర్శి ఎంఏ ఖయూమ్ కార్యనిర్వాహక కార్యదర్శి నల్ల నరసింహ గుండు మల్లయ్య, పాలమాకుల నరసింహ, కొడెం రాములు, దుర్గం శ్రీనివాస్, తడక ఆంజనేయులు, బత్తుల లింగస్వామి గౌడ్, బొజ్జ బుచ్చయ్య, ఉదరి సురేష్, ఉదరి రామచంద్రం తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -