పాడిరైతులకు పెండింగ్ పాలబిల్లులు వెంటనే చెల్లించాలి: మాటూరి బాలరాజు

– పాడిరైతులకు లీటర్ కు 4 ఇన్సెంటివ్ బకాయిలు విడుదల చేయాలి..
– పాడిరైతులకు లీటర్ కు రూ.5  ఇన్సెంటివ్ హామీ వెంటనే అమలు చేయాలి..
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
పాడి రైతులకు పెండింగ్ పాలబిల్లులు వెంటనే చెల్లించాలనీ, పాడిరైతులకు లీటర్ కు 4  రూపాయల ఇన్సెంటివ్ బకాయిలు విడుదల చేయాలనీ, పాడిరైతులకు లీటర్ కు 5 రూపాయలు ఇన్సెంటివ్ హామీ వెంటనే అమలు చేయాలని రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మాటూరి బాలరాజు కోరారు. శుక్రవారం సుందరయ్య భవన్లో తెలంగాణ రైతు సంఘం జిల్లా కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షులు మేక అశోక్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించగా,  ఆయన  ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.  తెలంగాణ రాష్ట్ర ములో సహకార పాడి పరిశ్రమను నమ్ముకొని రాష్ట్రలో దాదాపు 7.5 లక్షల మంది పాడిరైతులు రోజుకు 4 లక్షల లీటర్లు పాలు పంపిస్తున్నారనీ,  వారికీ ప్రతి పదిహేను రోజులకోసారి పాల బిల్లులు చెల్లించాలనీ, పాల బిల్లులు చెల్లింపులో జాప్యం జరుగుతుందని,  పాడి రైతులకు ప్రతి పదిహేను రోజులకోసారి పాల బిల్లులు చెల్లించాలనీ కోరారు. జిల్లాలో, సొసైటీలకు ఎన్నికలు నిర్వహించాలని అన్నారు. విద్యుత్ అధికారులు డెయిరీ పామ్ ల  కు యాజమానులకు ,కనీసం బావుల వద్ద పశువులను పెంచుకుంటే బావిలోని  పాడిరైతులకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేయాలి. లీటర్ కు 4 రూపాయలు ఇన్సెంటివ్ బకాయిలు వెంటనే చెల్లించాలి. పాడిరైతులకు లీటర్ కు 5 రూపాయలు ఇన్సెంటివ్  హామీనీ వెంటనే అమలు చేయాలి. పాడిపశువులకు ప్రభుత్వం ఇన్సూరెన్స్ పథకం ప్రవేశ పెట్టాలి. పాడిరైతులకు గడ్డి కటర్ మిషిన్, పాలు పిండే మిషిన్, దాణా 50% సబ్సిడీతో సరఫరా చెయ్యాలి. ఈ సమస్యలు పరిష్కారం చేయకపోతే పాడి రైతులని కదిలించి ఆందోళన పోరాటం చేస్తామని అన్నారు.  రాష్ట్ర ప్రభుత్వంధాన్యం క్వింటాల్ కు. రూ500లు బోనస్ ఇస్తమని ప్రకటించిన ముఖ్య మంత్రి  మాటమార్చి,  దగాచేసి సన్నరకం దాన్యానికే 500రూపాయలు బోనస్ ఇస్తమనటం, ” ఓడ  దాటేదాక ఓడ మల్లయ్య” ఓడదాటినంక  బోడి మల్లయ్య” ఆన్న చందంగా. వ్యవహరిస్తే పెద్ద ఎత్తున రైతులను సమీకరించి దొడ్డ  రకం ,సన్న  రకం ధాన్యానికి  500 రూపాయలు బోనస్ సాధించే వరకు పోరాడుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మేక అశోక్ రెడ్డి, మాటూరి బాలరాజు గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు మంగ నర్సింహులు, భూరుగు కృష్ణా రెడ్డి, జిల్లా సహాయ కార్యదర్శులు ,  చీరిక అలివేల , బోయిని ఆనంద్, కందాడి సత్తి రెడ్డి,  జిల్లా కమిటీ సభ్యులు పిఎసిఎస్  మాజీ చైర్మెన్ చీర్క సంజీవ రెడ్డి, పొట్ట శ్రీను, గన్నెబోయిన విజయ , భాస్కర్, బబ్బురి పోశెట్టి,  ర్యాకల శ్రీశైలము, నాయకులు నరాల చంద్రయ్య, మచ్చ భాస్కర్లు పాల్గొన్నారు.
Spread the love