ప్రజలు బీఆర్‌ఎస్‌పై తిరుగుబాటుకు సిద్ధమయ్యారు

– రాష్ట్రంలో 80సీట్లు గెలుస్తాం
– 31న కొల్లాపూర్‌లో పాలమూరు ప్రజాభేరి బహిరంగ సభ
– టీపీసీసీ ఉపాధ్యక్షులు మల్లు రవి
నవతెలంగాణ-ఆమనగల్‌
రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రజలంతా బీఆర్‌ఎస్‌పై తిరుగుబాటుకు సిద్ధమయ్యారని టీపీసీసీ ఉపాధ్యక్షులు మల్లు రవి అన్నారు. బీఆర్‌ఎస్‌ పాలన నుంచి విసుగు చెందిన ప్రజలు కాంగ్రెస్‌తో కలసి వస్తున్నారని ఆయన చెప్పారు. ఆమనగల్‌ పట్టణంలో గురువారం ఏర్పాటు చేసిన విలే కరుల సమావేశంలో మల్లురవి మాట్లాడారు.. సుస్థిర ప్రజాస్వామ్య పాలన కాంగ్రెస్‌తోనే సాధ్యమని విశ్వసించిన ప్రజలు రాష్ట్రంలో కాంగ్రెస్‌కు బ్రహ్మరథం పడుతున్నారని అన్నా రు. కేసీఆర్‌ అరాచక పాలనకు చరమగీతం తప్పదన్నారు. కాంగ్రెస్‌కు లభిస్తున్న ఆదరణ చూసి బీఆర్‌ఎస్‌ నేతలకు ఓటమి భయంతో వణుకు మొదలైందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ 80 స్థానాలు గెలుచుకొని అధికారం చేపడుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఉమ్మడి మహబూబ్‌ నగర్‌ జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలు కాంగ్రెస్‌ భారీ మెజార్టీతో గెల్చుకుం టుందని చెప్పారు. రైతుబంధు, దళితబంధు, బీసీబంధు, గృహలక్ష్మి పథకాలు ఇవ్వలేక బీ ఆర్‌ఎస్‌ ప్రభుత్వం కాంగ్రెస్‌పై దుష్ప్రచారానికి ఒడిగట్టిందని మండిపడ్డారు. కేసీఆర్‌ కు టుంబం అవినీతి పాలన, పాపాలకు ప్రజా క్షేత్రంలో తగిన శిక్ష తప్పదు అన్నారు. ఈ నెల 31న కొల్లాపూర్‌లో పాలమూరు ప్రజాభేరి బహిరంగ సభ నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు. సభకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి, తదితరులు ముఖ్య అతిథులుగా హాజరవు తున్నట్టు పేర్కొన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్‌ పట్టణ అధ్యక్షులు వస్పుల మానయ్య, యూత్‌ కాంగ్రెస్‌ పట్టణ అధ్యక్షులు వస్పుల శ్రీకాంత్‌, కాంగ్రెస్‌ జిల్లా నాయకులు మధుసూదన్‌రెడ్డి, వస్పుల శ్రీశైలం, ఎన్‌ఎస్‌ యూఐ మండల అధ్యక్షుడు ఎండి ఫరీద్‌, రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love