కాంగ్రెస్ ను నమ్మే పరిస్థితిలో తెలంగాణ ప్రజలు లేరు..

– ఎమ్మెల్సీ వి జి గౌడ్
నవతెలంగాణ- గాంధారి :
గాంధారి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ విజికోడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ను నమ్మే పరిస్థితిలో తెలంగాణ ప్రజలు లేరని కాంగ్రెస్ పరిపాలించిన రోజుల్లో కరెంటు కష్టాలు ప్రజలకు తెలుసని ఎరువుల కోసం విత్తనాల కోసం తెలంగాణ ప్రజల పడ్డ కష్టాలు మళ్లీ రావాలని ప్రజలు కోరుకోవడం లేదని కాంగ్రెస్ అంటేనే కుంభకోణాలు కుమ్ములాటలని ఆయన విమర్శించారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తొమ్మిది  సంవత్సరాలలో సంక్షేమం అభివృద్ధి రంగాల్లో దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉంచారని తెలంగాణలో అమలవుతున్న పథకాలు దేశంలో బీజెపి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడ లేవని ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న ప్రకటించిన మేనిఫెస్టో అంశాలను కాంగ్రెస్ బీజెపిలో జీర్ణించుకోలేక పోతున్నాయని సురేందర్ రెండవసారి ముఖ్యమంత్రి మూడోసారి విజయం సాధించడం ఖాయమని ఆయన అన్నారు ఎల్లారెడ్డి బీఆర్ఎస్‌ అభ్యర్థి సురేందర్ మాట్లాడుతూ రాష్ట్రంలో 24 గంటల ఉచిత విద్యుత్ ముఖ్యమంత్రి కేసీఆర్ వల్లే సాధ్యమైందని వరి ఉత్పత్తిలో దేశంలోనే నెంబర్ వన్ స్థానానికి ఎదిగామని ఇన్ని  సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించిన కాంగ్రెస్ రాష్ట్రానికి చేసింది ఏమీ లేదని రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ పగటి కలలు కంటూదాని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్‌ రాష్ట్ర నాయకులు తనాజీ రావు, ఎంపీపీ రాధ బలరాం, జడ్పీటీసీ శంకర్ నాయక్, ఏఏంసి చేర్మెన్ సత్యం రావు, పిఏసిఎస్ చేర్మెన్ సాయికుమార్, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు గాంధారి సర్పంచ్ మమ్మాయి సంజీవ్ యాదవ్, ఏఏంసి వైస్ చేర్మెన్ రెడ్డి రాజు, ఎంపిటిసి పత్తి శ్రీనివాస్ మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులు  ఎంపిటిసిలు బీఆర్ఎస్‌ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
Spread the love