తెలంగాణ ప్రజలు మరో ఉద్యమానికి సిద్ధం కావాలి

– రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని గద్దె దించాలి
– జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు కోదండరాం
నవతెలంగాణ-భూపాలపల్లి
తెలంగాణ ప్రజలు మరో పోరాటానికి సిద్ధం కావాలని, రాష్ట్రంలో బిఆర్‌ఎస్‌ ప్రభుత్వా న్ని గద్దె దించాలని జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు కోదండరాం పిలుపునిచ్చారు. సోమవారం జిల్లా కేంద్రంలోని భాతాల భవన్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ యన మాట్లాడుతూ… తెలంగాణ ప్రజలందరి ఉమ్మడి పోరాటాల ఫలితంగా, అమరుల బలి దానాల సాక్ష్యంగా ఏర్పడిన తెలంగాణలో అధికా రంలోకి వచ్చిన కేసీఆర్‌ ప్రభుత్వం ఇప్పుడు ఉద్యమ ఆకాంక్షల సాధన దిశగాఅడుగులు వే యలేదన్నారు. రాజ్యాంగ విలువలకు తిలోదకా లిచ్చి, అన్నీ రాజ్యాంగ వ్యవస్థలనుకుప్ప కూల్చి, రాష్ట్రాన్ని ఒక కుటుంబ జాగీరుగా మార్చి అప్ర జాస్వామిక నియంతత్వ పాలన కొనసాగిస్తుంద న్నారు. భూపాలపల్లిలో ఖాలీ జాగ వుంటే వాటిని స్థానిక నేతలు కబ్జా చేయడం జరుగు తుందని ఆరోపించారు. మెడిగడ్డ పై వాస్తవ స మాచారం ప్రభుత్వం ఇంకా కమిటీ కి ఇవ్వలే దన్నారు. కెసిఆర్‌ పాలన కాళేశ్వరం ప్రాజెక్ట్‌ చూస్తే తెలుస్తుందని, ప్రజాధనం దుర్వినియో గం అయిందని ఆరోపించారు. ఈ నేపధ్యంలో ఉద్యమ ఆకాంక్షల

Spread the love