మండల ప్రత్యేక అధికారి వెంకటేష్
నవతెలంగాణ – మిడ్జిల్
ప్రభుత్వం తీసుకొస్తున్న ప్రతి సంక్షేమ పథకాన్ని అర్హులైన పేదలందరికీ అందే విధంగా సర్పంచులు ,అధికారులు, ప్రజాప్రతినిధులు కృషి చేయాలని మండల ప్రత్యేక అధికారి వెంకటేష్ అన్నారు. గురువారం ప్రజా పాలన..ప్రగతి ప్రణాళిక మండల సభ గురువారం మిడ్జిల్ మండల కేంద్రంలోని ఎంపిడిఓ కార్యాలయం ప్రాంగణంలో ప్రజా పాలన.. ప్రగతి ప్రణాళిక మండల సభ నిర్వహించారు. మండల ప్రత్యెక అధికారి వెంకటేష్ మాట్లాడుతూ 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృధి పథకాలు సాధినియోగం చేసుకోవాలని చెప్పారు.
గ్రామాబివృధి, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, కళ్యాణ లక్ష్మి పథకంతో నిరుపేదలకు లాభం చేకూరిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ స్వప్న, వ్యవసాయ అధికారి సిద్ధార్థ , పశువైద్యాధికారి శివరాజ్, ఎంపిడిఓ గీతాంజలి, ఎంపీ ఓ రాజశేఖర్ రెడ్డి సర్పంచులు ఎడ్ల శంకర్, సుజాత, సువర్ణ, నాగరాజు గౌడ్, మాధవి, శ్రీశైలం, అంజన్ రెడ్డి, చంద్రయ్యా గౌడ్, మంగమ్మ ,, ఏఈ లు నరేందర్, మహేష్, డాక్టర్లు శివరాజ్, మీర్జా , పంచాయతీ కార్యదర్శులు మండల శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.



