ప్రజలు ఓడిపోకూడదు…

People should not lose…కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో ఇప్పుడు జరుగుతున్నదేమిటి..? రాష్ట్రాధినేతలు చెబుతున్నట్టు ఈ రాష్ట్రం నిజంగానే బంగారు తెలంగాణ అయ్యిందా..? అంటే కాలేదనే సమాధానమే వస్తుంది. ఎందుకంటే ఇక్కడ లెక్కకు మిక్కిలిగా సమస్యలు పేరుకు పోయాయి. అనేక తరగతుల ప్రజానీకం తమ డిమాండ్ల సాధనకు రోడ్డెక్కుతూనే ఉన్నారు. కాకపోతే సంక్షేమ, అభివృద్ధి జపాల ముందు.. ప్రసార, ప్రచార మాధ్యమాల ప్రాధాన్యతల ముందు అవి బయటకు రాకుండా ఎక్కడో మూలన పడిపోతున్నాయి.
‘ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలే ఎన్నుకునే ప్రభుత్వాన్నే ప్రజా స్వామ్య ప్రభుత్వం అంటారు..’ ఇదీ డెమోక్రసీకి అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహాం లింకన్‌ ఇచ్చిన నిర్వచనం. కానీ ఇప్పుడు మన రాష్ట్ర ఎన్నికల ప్రహసనంలో ప్రజాస్వామ్యపు అర్థం పూర్తిగా మారి పోయింది. ‘నాయకుల చేత నాయకుల కోసం నాయకులే నిర్ణయించేది…’ అన్న ట్టుగా దాని నిర్వచనాన్ని మన నేతలు మార్చేశారు. ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలను పరిశీలిస్తే ఇదే విషయం బోధపడుతున్నది. నేనే సీఎం అవుతానంటూ జానా, కోమటిరెడ్డి బ్రదర్స్‌, జగ్గారెడ్డి జబ్బలు చరు చుకోవటంలోనూ, బీసీనే సీఎం చేస్తామంటూ బీజేపీ ఊదరగొట్టటం లోనూ, కేసీఆరే మరోసారి సీఎం అవుతారంటూ బీఆర్‌ఎస్‌ బృందా లు… జపం చేయటంలోనూ ఎవరి ప్రయోజనాలు దాగున్నాయి..?
ఇక్కడ మనకు మనం ఒక ప్రశ్న వేసుకోవాలి. నిజానికి ఎన్నికలు, ఓట్లు, చట్టసభలనేవి ఎవరి కోసం..? ఎవరి ప్రయోజనాలకోసం..? అంటే ఒకరిద్దరు వ్యక్తుల కోసమో లేక ఒకట్రెండు పార్టీల ప్రయో జనాల కోసమో కాదు అనే సమాధానం కచ్చితంగా వచ్చి తీరుతుంది. విశాల ప్రజా ప్రయోజనాల కోసం అవన్నీ ఉన్నదనే విషయాన్ని ఎవరూ కాదనే సాహసం చేయలేరు. కానీ కొట్లాడి సాధించు కున్న తెలంగాణలో ఇప్పుడు జరుగుతున్నదేమిటి..? రాష్ట్రాధి నేతలు చెబుతున్నట్టు ఈ రాష్ట్రం నిజంగానే బంగారు తెలం గాణ అయ్యిందా..? అంటే కాలేదనే సమాధానమే వస్తుంది. ఎందుకంటే ఇక్కడ లెక్కకు మిక్కిలిగా సమస్యలు పేరుకు పోయాయి. అనేక తరగతుల ప్రజానీకం తమ డిమాండ్ల సాధ నకు రోడ్డెక్కుతూనే ఉన్నారు. కాకపోతే సంక్షేమ, అభివృద్ధి జపాల ముందు.. ప్రసార, ప్రచార మాధ్యమాల ప్రాధాన్యతల ముందు అవి బయటకు రాకుండా ఎక్కడో మూలన పడిపోతున్నాయి.
గులాబీ పార్టీ పదేండ్ల పాలనలో అనేక సమస్యలు తిష్ట వేసుక్కూర్చున్నాయి. రైతు బంధు, రైతు బీమా ద్వారా వ్యవసా యాన్ని బాగు చేశామని చెబుతున్న సర్కారు… ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టునే పదే పదే చూపుతోంది. కానీ ఇప్పుడు మేడిగడ్డ బ్యారే జీకి ఏర్పడ్డ పగుళ్ల వల్ల దాంతో పాటు అన్నారం బ్యారేజీని సైతం పూర్తిగా తీసేసి పునర్‌ నిర్మించాలంటూ కేంద్ర బృందం తేల్చింది. ఇది సర్కారుకు తలకు మించిన భారం కానుంది. మరోవైపు ఆ ప్రాజెక్టు గురించి ఆర్భాటపు ప్రకటనలు చేస్తున్న ప్రభుత్వం… ఇప్పటివరకూ దాని కింద ఒక్క ఎక రాకూ నీరివ్వకపోవటం గమనార్హం. అసలు సంబంధిత కాల్వలే నిర్మిం చకపోవటం విస్మయకర అంశం. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి నేటి వరకూ ప్రతీయేటా ప్రకృతి విపత్తులు సంభవించి వేల కోట్ల మేర పంటలు నష్టపోతున్నా… ఆయా పంటలకు పరిహారం అం దించిన దాఖలాల్లేవు. ఇక రాష్ట్రంలో కోట్లాది మంది వ్యవసాయ కూలీ లు, భవన, ఇతర నిర్మాణ కూలీలకు దినసరి వేతనం రూ.300 నుంచి రూ.500 మించి లేదని లెక్కలు చెబుతున్నాయి. వామపక్ష పాలిత రాష్ట్రమైన కేరళలో సగటు దినసరి వేతనం రూ.800 నుంచి రూ. వెయ్యి దాకా ఉంది. మరోవైపు 73 షెడ్యూల్‌ ఎంప్లాయిమెంట్స్‌లో కనీస వేతనాలు అమలు కావటం లేదు. ప్రభుత్వ ఖజానాపై నయా పైసా భారం పడకపోయినా కనీస వేతన జీవోలను సవరిం చటానికి సర్కారు ముందుకు రావటం లేదు. ఆశాలు, అంగన్‌ వాడీలకు దేశంలో ఎక్కడా లేని విధంగా వేతనాలు పెంచామని బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చెబుతున్న ప్పటికీ… ఇతర రాష్ట్రాలతో పోల్చి చూసినప్పుడు మనకంటే అధిక వేతనాలిచ్చే రాష్ట్రాలు అనేకం ఉన్నాయని తేలింది.
ఇక కాంగ్రెస్‌ విషయానికొస్తే… అసలు ఈ దేశంలో ప్రయివేటీక రణ, కార్పొరేటీకరణకు నయా ఉదారవాద ఆర్థిక విధానాల రూపంలో తలుపులు తెరిచింది ఆ పార్టీయే. వాటిని ఉధృతంగా అమలు చేస్తున్నది బీజేపీ. ఫలితంగా నెలకొన్న అనేక దుష్పరిమాణాలకు ఇప్పుడు దేశం మూల్యం చెల్లించుకుంటోంది. అందువల్ల నిరుద్యోగం, దరిద్రం, అవి నీతి లాంటి వాటి గురించి మాట్లాడటానికి ఆ రెండు పార్టీలకూ ఎలాం టి హక్కూ లేదు. మరోవైపు అనేక రకాల వాగ్దానాలను కుమ్మరిస్తున్న బీజేపీ, ఇప్పుడు కొత్తగా బీసీని సీఎం చేస్తామంటూ ప్రకటిస్తోంది. ఇప్పు డు తాను అధికారంలో ఉన్న రాష్ట్రాలన్నింటిలో వాటిని అమలు చేయని ఆ పార్టీ… ఇక్కడ మాత్రం ఆర్భాటపు మాటలు గుప్పిస్తోంది. ఈ క్రమం లో అనేకానేక ప్రజా సమస్యలపై చర్చించి, పరిష్కరించ టానికే చట్ట సభలున్నాయన్న వాస్తవాన్ని మనం మరువరాదు. ఆ చట్ట సభల్లో కాలు మోపి… ప్రజా సమస్యలపై గళమెత్తటానికే ప్రజా ప్రతిని ధులున్నారు. ఎన్నికలు, ఓట్లనేవి ఉన్నది అలాంటి ప్రజా ప్రతినిధులను ఎన్నుకోవటా నికే. అసలు సిసలైన ఈ నిజాన్ని విస్మరించి.. ‘సీఎం కుర్చీచుట్టూ’ రాజ కీయాలు నెరుపుతున్న పార్టీల వైఖరులను తూర్పార బట్టాలి. ఎవరెవరి ని ఎమ్మెల్యేలుగా ఎన్నుకోవాలి? తద్వారా ఏ పార్టీని అధికారంలోకి తీసు కురావాలి? ఆ రకంగా ఎలాంటి ప్రభుత్వాన్ని గద్దెనెక్కించాలనేది నిర్ణ యించాల్సింది ప్రజలు. ఆ ప్రజలే ఇలాంటి రాజకీయాలకు చెక్‌ పెట్టాలి.

Spread the love