చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

నవతెలంగాణ – వలిగొండ రూరల్ 
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలోని నాతాళ్లగూడెంలో  గురువారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని నాతాళ్లగూడెంకు  చెందిన కోరబోయిన కృష్ణ(29) ప్రైవేటుగా ఉద్యోగం చేసుకుంటు హైదారాబాద్ లో నివాసం ఉంటున్నాడు. మంగళవారం
స్వగ్రామానికి చేరుకున్న ఇతను గ్రామంలో నిర్మించ తలపెట్టిన ఇంటి నిర్మాణం విషయంలో మానసిక వత్తిడి తట్టుకోలేక జీవితం మీద విరక్తి చెంది రైల్వే ట్రాక్ సమీపంలో గడ్డి మందుతాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. గడ్డి మందుతాగి అపస్మారక స్థితిలో పడి ఉన్న కృష్ణ స్థానికులు గుర్తించి చికిత్స నిమిత్తం మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి వైద్యం నిర్వహించారు. మెరుగైన వైద్యం నిమిత్తం హైదారాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తుండగా మృతి చెందినట్లు వైద్యులు తెలిపారని మృతుని తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మహేందర్ లాల్ తెలిపారు. మృతుని కుటుంబానికి న్యాయం చేయాలి  మృతుడు కోరబోయిన కృష్ణ గడ్డి మందుతాగి అపస్మారక స్థాయిలో ఉండటంతో అతనిని స్థానిక రేణుక దేవి ఆసుపత్రికి తరలించగా అక్కడ వైద్యులు వైద్యం అందించడంలో నిర్లక్ష్యం చేశారని ఆసుపత్రిపై వైద్యులపై చర్యలు తీసుకోవాలని మృతుని కుటుంబ సభ్యులు, బంధువులు గ్రామస్తులు నాతాళ్లగూడెం వద్ద రాస్తా రోకో నిర్వహించారు. వెంటనే పోలీసులు  అక్కడకు వెళ్లి వారిని శాంతింపచేశారు
Spread the love